కేసు విచారణకు వచ్చిన తర్వాత కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించిన అనంతరం.. "అయితే మహిళను విచారణకే పిలవకూడదు అంటే ఎలా అని" సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు వినిపించిన నాటి నుంచి ఈ వ్యవహారంలో పరిణామాలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కూడా మహిళలకు పలు రక్షణలు కల్పించిందని, బెయిల్ సెక్షన్ 45లో కూడా మహిళలకు అనేక సడలింపులు ఉన్నాయని వివరించారు.
అయితే కవితకు తాజాగా ఈడి అధికారులు నోటీసులు పంపించడం రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇటీవల ఈడి అధికారుల ఎదుట అప్రూవర్ గా మారిపోతున్నట్టు అంగీకరించారు.
ముఖ్యంగా సౌత్ లాబీలో సిబిఐ, ఈడి గుర్తించిన నిందితుల్లో ఒక్క ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్ప దాదాపు అందరూ అప్రూవర్లు అయ్యారు. అంటే ఒక్క కవిత ను మాత్రమే నిందితురాలిగా చూపేందుకు ఈ ప్రయత్నం చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం జాబితాలో ఉంది. గతంలో ఆయనకు నోటీసులు సైతం జారీ చేశారు. కానీ ఎప్పుడు విచారణకు మాత్రం హాజరు కాలేదు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను కట్టడి చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. ఈ పిటిషన్ ను విచారించే బాధ్యత జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కు సుప్రీంకోర్టు అప్పగించింది. అయితే ఆయన అందుబాటులో లేని కారణంగా సోమవారం కోర్టు నెంబర్ 2 కార్యకలాపాలు రద్దయ్యాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారే అవకాశాలను కేంద్రం కల్పించింది. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తోంది ఈ మేరకు హోం శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది.
MLC Kavitha- ED: ఢిల్లీ మద్యం కుంభకోణం లో కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఈడీ సోమవారం సాయంత్రం పేల్చిన బాంబు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కవిత.. మద్యం వ్యాపారం ద్వారా పొందిన లాభాలతో కొనుగోలు చేసిన భూముల వివరాలను ఈడీ తన ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. అంతే కాదు హైదరాబాద్ లో భూముల ధరలు చుక్కలనంటుతున్న వేళ.. తక్కువకే కోట్ల రూపాయల విలువైన భూములను చౌక […]
అయితే ఈసారి ట్విస్ట్ ఏంటంటే చార్జిషీట్లో కవిత భర్త అనిల్ కుమార్ పేరు కూడా ఈడీ ప్రస్తావించడం విశేషం