కరోనా భయంతో తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పెరుగుతండటం ఆందోళన కలిగిస్తున్నది. కొవిడ్ సోకిందన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెడన గ్రామంలో గురువారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లీలాప్రసాద్ (40) భారతీ (38) ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తమకు కరోనా సోకిందన్న భయంతో నాటి నుంచి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో దంపతులు […]
దేశంలో కరోనా మారణహోమం పతాక స్థాయికి చేరడంతో.. జనం బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం లక్షలాది కేసులు.. వేలాది మరణాలు సంభవిస్తుండడంతో భయంగుప్పిట్లో బతుకుతున్నారు. ఇది చూస్తున్న విదేశీయులు భారత్ పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇక, ఇండియాకు రావాలని పిలిస్తే హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మేం రాలేం బాబోయ్ అంటున్నారు! విదేశాలకు చెందిన ఎంతో మంది ఉద్యోగులు భారత్ లో పనిచేస్తున్నారు. వీరితోపాటు కొత్తవారు కూడా దిగుమతి కావాల్సి ఉంది. అయితే.. కరోనా కల్లోలంతో ఇక్కడున్న చాలా మంది స్వదేశాలకు […]
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలపై వ్యతిరేకత పెరుగుతోంది. రోజురోజుకు ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. కరోనా సెకండ్ వేవ్ తో జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతాలు కొత్తేమీ కాదు. అయినా కరోనా నిరోధానికి చర్యలు తీసుకోవడంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనేది జగమెరిగిన సత్యం. దీంతో కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడం పెను సవాల్ గా […]
‘భయం చాలా చెడ్డది’. అదే ప్రాణాలను తీస్తుంది.. ఒక్కసారి ధైర్యంగా ఉన్నామా? ప్రపంచం మొత్తం అంతమై నువ్వొక్కడివే మిగిలినా సరే నీ ప్రాణం పోదు.. పోరాడగలవు. ధైర్యమే మనకు శ్రీరామ రక్ష. మా స్నేహితుడు ఒకడు.. బాగా కండలు తిరిగిన వ్యక్తి.. రోజూ ఉదయం సాయంత్రం ఎక్సర్ సైజ్ చేస్తాడు.. మంచి దేహధారుడ్యం ఉన్న మనిషి. రోగాలు ఏం లేవు. యోగా కూడా చేస్తాడు. అయితే సడెన్ గా ఇటీవల కరోనా సోకింది.. నిండా 35 ఏళ్లు […]
కరోనా ఫస్ట్ వేవ్ లో సినిమా ఇండస్ట్రీపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కానీ.. ఇప్పుడు సినీ పరిశ్రమే స్వయంగా ఆంక్షలు ప్రకటించుకుంది! ఇది చాలు.. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై ఏ స్థాయిలో పడిందో చెప్పడానికి. ఇప్పటికే థియేటర్లు మూసేశారు. షూటింగులు కూడా ఒకటి తర్వాత ఒకటి అన్నట్టుగా వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితి ఎందాక పోతుంది? ఎన్నాళ్ల వరకు ఉంటుంది? దీనివల్ల కలిగి నష్టం ఎంత? ఇవే ఇప్పుడు ఇండస్ట్రీ వేసుకుంటున్న లెక్కలు! జనవరి […]
కరోనా మహమ్మారి మరోసారి అందరి పాలిట మెయిన్ విలన్ గా తయారైంది. కేవలం నెల రోజుల్లోనే పుంజుకున్న సెకండ్ వేవ్.. మహోగ్ర రూపమై దేశాన్ని భయపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వారం పదిరోజుల కిందటి వరకూ ఓ మోస్తరుగా నమోదైన కేసులు.. ఇప్పుడు వేలాదిగా పెరుగుతున్నాయి. దీంతో.. జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఫలితంగా.. అన్ని రంగాలపై ప్రభావం మొదలైంది. మహారాష్ట్ర వంటి చోట్ల థియేటర్లు, షూటింగులు, వ్యాపారాలు అన్నీ మూసేశారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ కఠిన నిబంధనలు […]
తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు పరిస్థితి మొన్నటివరకు ఒకవిధంగా.. ఇప్పుడు మరోవిధంగా మారిపోయింది. తిరుపతి లోక్ సభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే పార్టీలు అక్కడ మకాం వేశాయి. నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలను నియమించాయి. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగబోతుండగా.. అయితే ఇప్పుడు అందరి దృష్టంతా పోలింగ్ శాతంపై పడింది. దేశమంతా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ సీజన్ నడుస్తోంది. సెకండ్ వేవ్ జెట్ స్పీడ్‌లో దూసుకొస్తూ ప్రాణాలను హరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసుల […]
కరోనా సెకెండ్ వేవ్ అంటూ ఒకపక్క హడావుడి, దానికి తగ్గట్టుగానే మరోపక్క కరోనా కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. పైగా వరుసగా సినిమా వాళ్లకు కరోనా పాజిటివ్ కేసులు వస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు షూటింగ్ లను ఆపెసుకుని కూర్చున్నారు. ఈ క్రమంలోనే కరోనా వల్ల సమంత సినిమాకి కూడా బ్రేక్ పడింది. సమంత హీరోయిన్ గా గుణశేఖర్ తీస్తున్న ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ లో కరోనా కలకలం రేగిన మాట వాస్తవం. ఏకంగా దర్శకుడు […]
కరోనా మరణాలకు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు పొంతన లేకుండా పోతోందని మరోసారి రుజువైంది. కరోనాపై ప్రభుత్వం అంత సీరియస్‌నెస్ తీసుకురాకపోవడంతో ప్రజల్లోనూ ఇప్పుడు ఆ భయం పెద్దగా కనిపించడంలేదు. కానీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనేది ఎవరికీ తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ భయంకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రత తక్కువగా ఉందన్న ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మొద్దన్న విషయం దీని ద్వారా నిరూపితమైంది. కేవలం […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా విద్యాసంస్థలను మూసేసింది. హాస్టళ్లు, పాఠశాలల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఈ నిర్ణయం ప్రకటిచింది. దీంతో.. ఇప్పుడు అందరి దృష్టి సినిమా థియేటర్లపై పడింది. Also Read: వకీల్ సాబ్ ట్రైలర్.. ఈ సాయంత్రమే క్రేజీ అప్డేట్! వాస్తవంగా.. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత అన్ని రంగాలూ వేగంగా గాడినపడ్డాయి. […]