యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి రుచికి చేదుగా ఉంటాయి. కానీ ఇవి ఇచ్చే ఆరోగ్యం గురించి తెలిస్తే షాక్ అవుతారు. సాధారణంగా యాలకులు పాయసం, స్వీట్స్, పులావ్, బిర్యానీ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.
మన వంటింట్లో లభించే యాలకులతో మనకు ఎన్నో లాభాలున్న సంగతి తెలియదు. ఇందులో పొటాషియం, మెగ్నిషియం, కాల్సియం, మినరల్స్, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ సి మరియు ఫైబర్ లాంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. యాలకులు శరీరానికి మల్టీ విటమిన్ టాబ్లెట్ లా పనిచేస్తాయని చెబుతుంటారు ఆయుర్వేద వైద్యులు.
రోజు మనం తినే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మన జీవితం సాఫీగానే సాగుతుంది. వంట గదిలో ఆయుర్వేద ఔషధ దినుసులు చాలానే ఉంటాయి. వాటిని సక్రమంగా వినియోగిస్తే మనకు వ్యాధుల బాధ రానే రాదు. వెల్లుల్లి, ఉల్లి, అల్లం, పసుపు, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇలా వీటిని వాడటం వల్ల మన ఒంట్లో ఉన్న సమస్యలను సులభంగా పోగొట్టుకోవచ్చు.
Benefits of Cardamom (Elaichi) : మన దేశంలోని వంటశాలలో వినియోగించే మసాలా దినుసుల వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలతో అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. యాలకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. డయాబెటిస్, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లకు యాలకులు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దగ్గు, జలుబు సమస్యలతో బాధ పడేవాళ్లు యాలకులు వాడితే మంచిది. […]