మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు.
కరోనా కల్లోలం మరోసారి సినీ ఇండస్ట్రీని చావుదెబ్బ తీస్తోంది. ఇప్పటికే కరోనా-లాక్ డౌన్ తో ఏడాది పాటు మూతపడిన సినిమా ఇండస్ట్రీని తాజాగా సెకండ్ వేవ్ మరోసారి దెబ్బతీస్తోంది. తెలంగాణలో తాజాగా కరోనా విస్తృతి దృష్ట్యా రాత్రి కర్ఫ్యూను విధించారు. రాత్రి 8 గంటల తర్వాత అన్నీ మూసివేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బుధవారం నుంచి సినిమా థియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు. సినిమా థియేటర్ల నిర్వహణపై తాజాగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాడు. వకీల్ సాబ్ సినిమా ఫంక్షన్ కు, అంతకుముందు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం తన సిబ్బంది, సహాయకులందరికీ కరోనా సోకడంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆ తర్వాత నాలుగైదు రోజులకు పవన్ లోనూ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. మూడ్రోజులుగా కరోనాతో బాధపడుతున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి […]
దేశంలో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. సెకండ్ వేవ్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. పరిస్థితులు చేయిదాటిపోయేలా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో తాజాగా ఒకరోజు 25వేల కేసులు నమోదు కావడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం రెండో వేవ్ ను సరిగ్గా ఎదుర్కోలేదని.. కరోనా టీకాలను విదేశాలకు పంచి దేశంలో వేయకపోవడమే కొంప ముంచిందన్న అపవాదును మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన టీకాలను దేశంలో దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. వాటిని […]
కరోనాకు కాదెవరు అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారింది. దేశ రాజధాని ఢిల్లీ కరోనాకు ఆవాసంగా మారుతోంది. అక్కడ కేసులు ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఏకంగా 25 వేల కేసులు వెలుగుచూడడంతో దెబ్బకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. ఇప్పుడు ఢిల్లీలో సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులంతా కరోనా బారినపడుతున్నారు. ఆఖరు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం కరోనా బారినపడడం విశేషం, ఆయన మార్చి 4న కరోనా […]
వకీల్ సాబ్ మూవీ ఘనవిజయంతో జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ ఫంక్షన్ తోనే కరోనా బాధితుడిగా మారిపోయిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ ప్రీరిలీజ్ లో పాల్గొన్న పవన్ సన్నిహితులు, సిబ్బంది అందరికీ కరోనా సోకడంతో పవన్ వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఈ మేరకు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే క్వారంటైన్ నుంచే పార్టీ, సినిమా వ్యవహారాలు పర్యవేక్షస్తున్న పవన్ ఆరోగ్య పరిస్థితి దిగజారినట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా క్వారంటైన్ […]
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా పొన్నవరం గ్రామానికి చెందిన ఒక రైతు బిడ్డ జస్టిస్ ఎన్వీ రమణ ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎలా ఎదిగాడు? ఆయన ఎక్కడ చదివాడు? బాల్యం విద్యాభ్యాసం ఎలా జరిగింది? ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాడు.? ఆయన ప్రస్థానం ఎలా సాగిందనే దానిపై స్పెషల్ ఫోకస్.. భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితమే ఆమోదముద్ర […]
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీంకోర్టు 48వ సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ఇప్పటికే ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. బోబ్డే ఏప్రిల్ 23న రిటైర్ కానున్నారు. ఏప్రిల్ 24 న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ […]
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మరో సంచలన ప్రకటన చేశారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను ప్రారదోలారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మళ్లీ లాక్ డౌన్ దిశగా సాగుతున్న వ్యవహారంపై కేసీఆర్ అసెంబ్లీలో స్పందించారు. పక్కనున్న మహారాష్ట్రలో భారీ కేసులు నమోదు అవుతుండడం.. తెలంగాణకు ఆనుకొని ఉన్న నాందేడ్ జిల్లాలో లాక్ డౌన్ విధించడంతో తెలంగాణలోనూ లాక్ డౌన్ తప్పదని ఆందోళన మొదలైంది. స్కూళ్ల మూసివేతతో ఆ బలం రెట్టింపు అయ్యింది. శాసనసభలో బడ్జెట్ ఆమోదంపై చర్చ […]
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ఆమె అధికారికంగా ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందుజాగ్రత్తగా చర్యగా తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు అన్నింటిని రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మూసివేత ఆదేశాలు వైద్యకళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల […]