కేవలం వేతనాల కోసం పనిచేసే అధ్యాపకులు, వార్డెన్ల కారణంగానే లిఖిత మరణించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వాదన ఏంటంటే అధ్యాపకుల వేధింపులే విద్యార్థులను బలి తీసుకుంటున్నాయని కూడా కొంతమంది పేర్కొంటున్నారు.
మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మరణించడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. అసలు వర్సిటీలో ఏం జరుగుతోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
Basara IIIT: బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యాలయంలోని ఐదు వేల మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అల్పాహారం మానేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రెగ్యులర్ వైస్ ఛాన్స్ లర్ ను నియమించాలని.. పర్మనెంట్ ఉద్యోగులు లేకపోవడం.. ల్యాప్ టాప్, యూనిఫామ్స్ అందించాలని తాగునీటితో పాటు పలు సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆహారం చాలా దరిద్రంగా ఉంటుందని విద్యార్థులు ఆవేదన […]