అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి పెళ్ళై దశాబ్దం దాటిపోతుంది. అనసూయకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి టీనేజ్ కి వచ్చాడు. ఈ విషయాన్ని అనసూయ స్వయంగా చెప్పింది. ఇక అనసూయ వయసు నాలుగు పదులకు దగ్గర పడుతుంది. ఇటీవల 38వ బర్త్ డే జరుపుకుంది.
ఒక్కోసారి నన్ను భరించే నీ సహనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకరినొకరం అర్థం చేసుకొని ఎదుగుతున్నాము. మనం పర్ఫెక్ట్ కపుల్ కాదని తెలుసు. కానీ కష్టనష్టాల్లో ఒకరికొకరం తోడు ఉంటున్నాము. నన్ను నన్నుగా స్వాగతించినందుకు ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చింది. అనసూయ సందేశం భర్త మీద ఆమెకున్న ప్రేమను తెలియజేస్తుంది.