ఇటీవల చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షాలను కలిసి చర్చలు జరిపారు. దీంతో పొత్తు ఖాయమన్న సంకేతాలు వచ్చాయి.
దీని బట్టి ఇది వైసీపీ చేసిన హంగామాగా అర్ధమైపోయింది. అయితే ముందస్తుకు వెళతాను వెళతాను అంటే బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? ఎందుకు వారిస్తుంది? కానీ జగన్ అండ్ కో మాత్రం చేస్తున్న అతి మాత్రం విమర్శలకు దారితీస్తోంది.
అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ పై ఈ నెల 3న విచారణ జరనున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పెద్దలను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ ఢిల్లీ వెళుతున్నది సొంత ప్రయోజనాలకు తప్ప.. రాష్ట్రాభివృద్ధికి కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఈ నెల 5న జగన్ ఢిల్లీ టూర్ మారిన తరువాత ఏపీలో రాజకీయ సమీకరణలు మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ముదిరి పాకాన పడ్డాయా? అనే సందేహం కూడా ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వ్యక్తమవుతోంది. మరి దీనికి బిజెపి హై కమాండ్ ఎలాంటి కాయకల్ప చికిత్స చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.
అందుకే లక్ష్మణ్ కు కేంద్ర కేబినెట్ లో తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీనిపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు టాక్ నడుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?
ఈ అపాయింట్మెంట్ రద్దు కేటీఆర్ లో ఉన్న అసలు స్వభావాన్ని నేలకు దించిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఒకటేనని, జనం దృష్టి మరల్చేందుకే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
కేంద్రం వద్ద చంద్రబాబు గుట్టు ఉందని.. వాటిని అవసరమైతే విప్పుతామని సోము వీర్రాజు హెచ్చరించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా పల్లవి, సోము వీర్రాజు ఫైర్ చూస్తుంటే రెండు పార్టీల మధ్య మళ్లీ అగాధం ప్రారంభమైందా? అన్న చర్చ నడుస్తోంది.
అలాగని బీజేపీ చర్యలు వారికి మింగుడుపడవు. అందుకే తాము నిధులు ఇచ్చాం మహా ప్రభో అంటూ అగ్రనేతలు ఏపీ వచ్చి సౌండ్ చేసి మాట్లాడిన ఎల్లో, నీలి మీడియాలకు వినిపించలేదు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్నారు. అందుకే వచ్చే ఎన్నికల నాటి పరిస్థితుల్ని గుర్తించి.. మిత్రపక్షాలతో తమ బలగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ, బీజేపీ మధ్య గ్యాప్ నిజమా? కాదా? అని నిర్ధారించుకోలేకపోతోంది. అనుమానపు చూపులు చూస్తోంది. మరికొన్నిరోజులు ఆగి తమ పల్లకి రాజకీయాలను ప్రారంభించాలని వ్యూహం రూపొందించుకుంది.