రాజకీయాల వైపు ఆయన దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం ఇండియా సిమెంట్స్ చీఫ్ శ్రీనివాసన్. చెన్నై సూపర్ కింగ్ టీం ఓనర్ ఆయనే. ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలని అంబటి రాయుడు ఒక నిర్ణయానికి వచ్చారు.
2003లో వీవీఎస్ లక్ష్మణ్ కూడా చాలా బాగా ఆడినప్పటికీ అతన్ని వరల్డ్ కప్ టీంలో సెలెక్ట్ చేయలేదు. అలాగే 2019లో అంబటి రాయుడు చాలా మంచి పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చినప్పటికీ అతన్ని సెలక్టర్లు పట్టించుకోలేదు.
2018లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజ్ ఎప్పుడైతే రాయుడుని తీసుకుందో అప్పటినుంచి రాయుడు కెరియర్ చాలా అద్భుతంగా సాగిందనే చెప్పాలి.
దురదృష్టవంతులైన క్రికెటర్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు అంబటి రాయుడు. 2019 ప్రపంచ కప్ కు ముందు జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించి సత్తా చాటాడు. కానీ, సెలక్టర్లు రాయుడును జట్టు నుంచి తొలగించారు.
ఆసియా గేమ్స్ లో సత్తా చాటితే మాత్రం సీఎస్కే తదుపరి కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను చెన్నై యాజమాన్యం కన్ఫామ్ చేసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తున్నానని అంబటి రాయుడు ప్రకటించారు. కానీ ఏ పార్టీ అని మాత్రం చెప్పలేదు. జగన్ విధానాలను ప్రశంసించడం, పరోక్షంగా చంద్రబాబును వ్యతిరేకించడం చూస్తుంటే ఆయన వైసీపీలోకి వెళ్లడం ఖాయంగా కనబడుతోంది.
టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా తమ జట్టు తరఫున రాయుడు అద్భుతమైన ప్రదర్శన చేయడం ద్వారా లీగ్ లో మంచి ప్రదర్శన చేయాలని ఆకాంక్షిస్తోంది. రిటైర్మెంట్ ప్రకటన తర్వాత రాయుడు ఆడుతున్న తొలి లీగ్ లో మంచి ప్రదర్శన కనబరచాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.
రాయుడు ఎక్కడికి వెళ్లినా, ఎవరితో కలిసి ఆడినా ఆరోపణలు, వివాదాలే. ఈ మాట అన్నది సాక్షాత్తూ రాయుడే. మొదట హైదరాబాద్ జట్టుకు ఆడినప్పుడు శివలాల్ యాదవ్ తో గొడవపడ్డాడు.
శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ ను ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాకు ఆడించాలనేది వాళ్ళ అభిలాష అని తెలిపాడు. కానీ, అందుకు తాను అడ్డుగా ఉంటాననే భావనతో తన అడ్డు తొలగించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించారని వివరించాడు.
కులజాఢ్యం అనేది రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. తన పరిధిని పెంచుకుంది. మరింత విస్తృతమైంది. అన్ని రంగాల్లోనూ విస్తరించింది. చివరికి క్రికెట్‌ను కూడా వదల్లేదు. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే క్రికెట్ కు కూడా పాకింది. ఏకంగా– జాతీయ స్థాయి క్రికెట్‌ను శాసించే స్థాయికి చేరింది. దాన్ని కబళించి పడేసింది. దీని ఫలితమే– యంగ్ క్రికెటర్ అంబటి రాయుడు కేరీర్ అర్ధాంతరంగా ముగిసిందనే ఆరోపణలు ఉన్నాయి.