Viveka Case – Tadepalli Palace : ఆర్కే కొత్త పలుకు: వివేకా హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ పాత్ర పై సంచలన విషయాలు

“అవినాష్ రెడ్డిని రక్షించేందుకు విజయకుమార్ వంటి లాబీయిస్టులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రంగాల్లోకి దించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

  • Written By: NARESH
  • Published On:
Viveka Case – Tadepalli Palace : ఆర్కే కొత్త పలుకు: వివేకా హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ పాత్ర పై సంచలన విషయాలు
Viveka Case – Tadepalli Palace : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందా రెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎటువంటి తీర్పు ఇస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు కు సంబంధించి ఎటువంటి అడుగులు వేస్తుందో సిబిఐ అధికారులకు తెలుసో తెలియదో కానీ.. మీడియా మాత్రం ఏకంగా ఈ కేసు కు సంబంధించి రోజుకో తీరుగా సంచలన విషయాలను బయటపెడుతోంది.. అయితే కేటగిరిలో ఆంధ్రజ్యోతి ముందు వరుసలో ఉంది. ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆదివారం తాను రాసిన కొత్త పలుకులో కీలక విషయాలు బయటపెట్టారు. ఇందులో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనేవి పక్కన పెడితే కొన్ని కొన్ని విషయాలు నమ్మే విధంగా ఉన్నాయి.
విచారించక తప్పదు
ఆర్కే రాసిన దాని ప్రకారం.. “వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున జగన్ తో సమావేశమైన ఆ నలుగురినీ ఇవాళ కాకపోయినా రేపైనా సిబిఐ విచారించక తప్పదు. సదరు విచారణలో వారు నిజం చెబితే జగన్ రెడ్డి దంపతులకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటివరకు మనదేశంలో అవినీతి కేసులలో మాత్రమే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు జైలు శిక్షలు అనుభవించారు. ఇప్పుడు మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలతో పాటు క్రిమినల్ ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అయిన వాళ్ళను మొత్తం దూరం చేసుకున్నాడు. పార్టీలో కూడా విజయసాయిరెడ్డి వంటి నమ్మిన బంటునూ దూరం పెట్టాడు. ఒకరకంగా ఆయన ఇప్పుడు ఒంటరి. రాజశేఖర్ రెడ్డి తో సంబంధం ఉన్నవారే కాకుండా, ఆయన పట్ల గౌరవంతో జగన్ రెడ్డికి దగ్గరైన వారందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు.” అని అర్కే అసలు విషయాలు బయటపెట్టాడు.
అన్ని దారులు మూసుకుపోయాయి
“అవినాష్ రెడ్డిని రక్షించుకునేందుకు జగన్ అండ్ కో కు న్యాయవ్యవస్థలోని అన్ని దారులూ మూసుకుపోయాయి. ఇప్పుడు బంతి సిబిఐ కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఇప్పటివరకు కాపాడుతూ వచ్చిన అదృశ్య శక్తులు ఇకపై కూడా కాపాడతాయా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది. జగన్ రెడ్డి కోసం ఆ అదృశ్య శక్తులు అప్రతిష్టపాలు అయ్యేందుకు సిద్ధపడతాయా? అలా సిద్ధపడితే దాని ప్రభావం తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీపై పడకుండా ఉంటుందా? అవినాష్యుడిని రక్షించ గ్రామంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఊబిలో కూరుకు పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు వల్ల వైసీపీ ఇప్పటికే సరిపడా అప్రతిష్టను మూటకట్టుకుంటున్నది. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కేసులో మొదటిసారిగా జగన్ రెడ్డి ప్రతీమని భార్య భారతి రెడ్డి పై అనేక చూపుడు వేళ్ళు గురిపెట్టి ఉన్నాయి. ఆమె పాత్ర పై జనం అనుమానంగా చూస్తున్నారు..” ఇలాంటి కీలక విషయాలు చెప్పిన రాధాకృష్ణ వివేక హత్య కేసులో నిందితులు అందరికీ శిక్ష పడటంలో జాప్యం జరిగితే జరగవచ్చును కానీ.. శాశ్వతంగా తప్పించుకోలేరు అని నిర్వేదం ప్రకటించడం విశేషం..
విజయ్ కుమార్ నియామకం అందుకేనా?
“అవినాష్ రెడ్డిని రక్షించేందుకు విజయకుమార్ వంటి లాబీయిస్టులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రంగాల్లోకి దించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. న్యాయమూర్తులతో పరిచయం ఉన్నంత మాత్రాన వారిని ఎవరు ప్రభావితం చేయలేరని సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పష్టమైనది. న్యాయమూర్తి ఆదేశించిన తర్వాత కేసులోని మెరిట్స్ ఆధారంగానే న్యాయమూర్తులు వ్యవహరిస్తారని ఈ సందర్భంగా మరోమారు రుజువైంది. నా దింపుడు కళ్ళం ఆశతో ఢిల్లీలో పరిచయం ఉన్న ఒక అధికారిని ఈనెల 24 ముందు ఢిల్లీకి పంపారు. నేను ఢిల్లీలో రెండు రోజులు మకాం వేసినా ఉపయోగం లేకుండా పోయింది. అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా అడ్డుకునే అధికారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతుండటంతో జగన్ అండ్ విచారణ చేయడం మొదలుపెట్టింది. సొంత మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి వార్చడం మొదలుపెట్టింది.” ఇలా రాసుకుంటూ వచ్చిన ఆర్కే వివేకానందా రెడ్డికి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అల్లుడు మాత్రమే కాదని.. సొంత బామ్మర్ది కూడా అని కుండ కుండబద్దలు కొట్టాడు. రాజశేఖర్ రెడ్డి అక్కనే వివేకా వివాహం చేసుకున్నాడని, అలాంటి వ్యక్తి వివేకాను ఎందుకు చంపుతాడని ఆర్కే అల్టిమేటం ఇచ్చేసాడు. వివేకానంద రెడ్డి హత్య వెనుక ఎన్నో కుట్ర కోణాలు కనిపిస్తున్నప్పటికీ… ఆర్కే లాగా మిగతా మీడియా సంస్థలు రాయడం లేదు. ఆఫ్ కోర్స్ ఇది తెలుగుదేశం పార్టీకి కూడా చేతకావడం లేదు..

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు