Taapsee Pannu: రాత్రయితే చాలు ఆ హీరోలిద్దరు రూమ్ కి రమ్మంటారు!

గతంలో అనేక సార్లు తెలుగు పరిశ్రమ మీద నోరుపారేసుకున్న తాప్సీ , తాజాగా బాలీవుడ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. మిగిలిన పరిశ్రమలతో పోల్చితే బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువ అంటూ హాట్ కామెంట్స్ చేసింది ఈ అమ్మడు.

  • Written By: Shiva
  • Published On:
Taapsee Pannu: రాత్రయితే చాలు ఆ హీరోలిద్దరు రూమ్ కి రమ్మంటారు!

Taapsee Pannu: కొందరు హీరోయిన్స్ నటన అద్భుతంగా ఉంటుంది. అందంలో వాళ్ళకి తిరుగే ఉండదు కానీ, కెరీర్ లో మాత్రం అనుకున్న స్థాయికి మాత్రం చేరుకోలేరు. ఆ కోవలోనే వస్తుంది హీరోయిన్ తాప్సీ. ఝుమ్మంది నాదం సినిమా తో తొలిసారిగా తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ప్రవేశించిన తాప్సీ ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించిన కానీ ఎందుకో ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. ఇక్కడ హీరోయిన్ గా స్థిరపడలేకపోయింది.

ఇక తెలుగులో లాభం లేదనుకుని కోలీవుడ్ మీదుగా బాలీవుడ్ వెళ్లిన ఈ అమ్మడు అక్కడ అడపాదడపా హీరోయిన్స్ రోల్స్ చేసిన కానీ తగిన గుర్తింపు రాకపోవటంతో లేడి ఓరియెంటెడ్ వైపు వెళ్ళింది. ఆ సినిమా లు తాప్సికి మంచి పేరును తీసుకొచ్చాయి. దీనితో అక్కడే నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తాప్సి చేసే కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతుంటాయి.

గతంలో అనేక సార్లు తెలుగు పరిశ్రమ మీద నోరుపారేసుకున్న తాప్సీ , తాజాగా బాలీవుడ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. మిగిలిన పరిశ్రమలతో పోల్చితే బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువ అంటూ హాట్ కామెంట్స్ చేసింది ఈ అమ్మడు. బాలీవుడ్ లో హీరోయిన్ గా ట్రై చేస్తున్న కొత్తల్లో కొందరు హీరోలు రాత్రి ఫోన్ చేసి రూమ్ కి రావాలంటూ అడిగేవారని, నేను అనేక సార్లు నో చెప్పాను, కానీ ఇద్దరు హీరోలు మాత్రం నన్ను బాగా ఇబ్బంది పెట్టారు.

ఇద్దరు హీరోలు అయితే రాత్రి అయితే ఫోన్ చేసి రూమ్ కి వస్తావా అంటూ వేధించేవారని.. ఒకవేళ రాకపోతే నీకు సినిమాల్లో అవకాశాలు లేకుండా చేస్తామని బెదిరించే వారిని.. నేను హీరోయిన్ గా నిలబడడానికి వచ్చాను గాని.. ఇలాంటి పనులు చేయడానికి కాదని, నేను లొంగనని గట్టిగా ఇవ్వడంతో అలా చివరికి వదిలేశారని చెప్పుకొచ్చింది. ఇలాంటి వరుసలోనే డైరెక్టర్లు కూడా ఉంటారని ఆమె అంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి వివాదాలు తాప్సి కి కొత్తేమి కాదు.

Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు