
Suryakumar Yadav
Suryakumar Yadav: ఫామ్ లో లేకపోతే అవకాశాలు ఇవ్వడానికి ఇవి సచిన్, ద్రావిడ్ రోజులు కావు. నిలవాలి, ఆడాలి, గెలిపించాలి.. ఇదే సూత్రం. కానీ కొంత మంది ఆట గాళ్ళ మీద మాత్రం బీసీసీఐ ఉదారత చూపుతోంది. వరుసగా అవకాశాలు ఇస్తోంది. అందులో మొదటి వరుసలో ఉన్న ఆటగాడు సూర్య. టీ 20 లో దుమ్ము రేపే ఈ ఆటగాడు వన్డే లకు వచ్చేసరికి విఫలమవుతున్నాడు. మైదానం లో 360 డిగ్రీలలో షాట్లు ఆడతాడు అనే పేరు ఉన్న ఈ బ్యాటర్ వన్డేల్లో మాత్రం సున్నా పరుగులకే ఔట్ అవుతున్నాడు. ఒక్కసారి అంటే పొరబాటు అనుకోవచ్చు. రెండో సారి కూడా అలానే ఔట్ అయితే ఏమనుకోవాలి?
ఆదివారం వైజాగ్ లో ఆసీస్, భారత్ మధ్య రెండో వన్డే జరిగింది. మొదటి మ్యాచ్ చచ్చీ చెడి గెలిచిన భారత్…రెండో వన్డే లో దానిని రిపీట్ చేయకుండా.. ఆసీస్ మీద గెలిచి సీరీస్ పట్టేయాలని యోచించింది. కానీ మైదానం లో జరిగింది వేరు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారత్ టాప్ ఆర్డర్ పని పట్టింది. గిల్, రోహిత్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్య ఖాతా తెరవకుండానే స్టార్క్ బౌలింగ్ లో ఎల్ బీ డబ్ల్యూ గా ఔట్ అయ్యాడు. ఇలా గోల్డెన్ డక్ ఔట్ కావడం సూర్య కు ఇది రెండో సారి. అతడు ఔట్ కావడం మిగతా జట్టు మీద తీవ్ర ప్రభావం చూపింది. మొదటి మ్యాచ్ లోనూ సూర్య ఇలానే ఔట్ అయ్యాడు.

Suryakumar Yadav
వాస్తవానికి అయ్యర్ గైర్హాజరుతో సూర్యకు అవకాశాలు దక్కుతున్నాయి.. కానీ వీటిని సూర్య ఉపయోగించుకోవడం లేదు.. వరుసగా సున్నా పరుగులకు ఔట్ అవుతూ నవ్వుల పాలవుతున్నాడు. అతడు సరిగ్గా ఆడక పోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దారణంగా ట్రోల్ చేస్తున్నారు.. ఇప్పటివరకు 22 వన్డేలు ఆడిన సూర్య 433 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ టీ 20 లో మాత్రం అతడు వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు లో కొనసాగుతున్నాడు.
Suryakumar Yadav during odi as soon as he comes for batting#INDvsAUS pic.twitter.com/WAek5msAf5
— bhaskar (@bhaskarj693) March 19, 2023