Bollywood Actor Dharmendra: 13 మంది మనవళ్లు, మనవరాళ్లు.. ధర్మేంద్ర పర్సనల్ లైఫ్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు..

ఈషా డియోల్ నవంబర్ 2, 1982న జన్మించింది. 2002లో విడుదలైన కోయి మేరే దిల్ సే పూచే చిత్రంతో ఇషా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇషా ముంబైకి చెందిన వ్యాపారవేత్త భరత్ తఖ్తానీతో జూలై 29, 2012న పెళ్లి చేసుకుంది.

  • Written By: Vishnupriya
  • Published On:
Bollywood Actor Dharmendra: 13 మంది మనవళ్లు, మనవరాళ్లు.. ధర్మేంద్ర పర్సనల్ లైఫ్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు..

Bollywood Actor Dharmendra: బాలీవుడ్‌ హీ-మ్యాన్‌ ధర్మేంద్ర బాలీవుడ్ ఇండస్ట్రీలో వారసత్వంగా వచ్చేవారు కాదు, బయట నుంచి వచ్చిన హీరోలు కూడా స్టార్ హీరోలుగా ఎదగగలరు అనేదానికి ఉదాహరణగా నిలిచాడు. ముఖ్యంగా అప్పట్లో అమ్మాయిల మదిలో యువరాజుగా నిలిచారు ఈ హీరో. కెమెరా ముందు ఉండాలనే ధర్మేంద్ర అభిరుచి దశాబ్దాల క్రితం దిలీప్ కుమార్‌ను ఆరాధించడంతో మొదలైంది. ఆ తరువాత అనేక సినిమాలు చేసి హిందీ ఇండస్ట్రీలో హీమాన్ గా పేరు తెచేసుకున్నారు. ఇక అలాంటి హీరో పర్సనల్ లైఫ్ లోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకుందాం.

ఈ లెజెండ్ డిసెంబర్ 8, 1935న పంజాబ్‌లోని లూథియానాలోని నస్రాలి గ్రామంలో జన్మించాడు. ధర్మేంద్ర రెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, తన తండ్రికి బదిలీ అయిన కారణంగా సనేవాల్‌కు మారాడు. ధర్మేంద్ర 8వ తరగతి చదువుతున్నప్పుడు, దేశం విభజనకు గురైంది. ఆ కారణం వల్లన సరిహద్దు దాటి వలస వచ్చి తన స్నేహితులకు దూరమయ్యారు ఈ హీరో .

ఇక ధర్మేంద్ర క్రమశిక్షణ చూసి అతని తండ్రి అతను ప్రొఫెసర్‌గా మారాలని కోరుకున్నాడు కానీ విధి అతని కోసం ఇతర ప్రణాళికలను కలిగి పొందడం వల్ల ఆఖరికి ఆయన హీరో అయ్యారు. అంతేకాకుండా ఆయన ఫ్యామిలీ నుంచి ఎంతో మంది బాలీవుడ్ లోకి వచ్చి పాపులర్ సెలబ్రిటీస్ అయ్యారు.

ధర్మేంద్ర తన 19వ ఏట 1954లో సినిమాల్లోకి రాకముందే ప్రకాష్ కౌర్‌ ని మొదటి వివాహం చేసుకున్నారు. ఇక వారిద్దరికీ ఇద్దరు కుమారులు ఉన్నారు. సన్నీ డియోల్, బాబీ డియోల్. ఇద్దరూ కూడా బాలీవుడ్ లో అనేక హిట్లను అందుకున్న నటులు. వీరిద్దరే కాకుండా ధర్మేంద్ర కి మొదటి పెళ్లి ద్వారా ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. వారు విజిత, అజీత. ఇక అతని మేనల్లుడు అభయ్ డియోల్ కూడా నటుడే.

బొంబాయికి వెళ్లి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన తర్వాత , ధర్మేంద్ర హేమమాలినిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి అప్పట్లో వివాదాలలో చిక్కుకుంది. ధర్మేంద్ర, హేమమాలిని తో వివాహం కోసం ఇస్లాం మతంలోకి మారారనే పుకార్లు వచ్చాయి. అయితే వాటిని ధర్మేంద్ర, హేమమాలిని ఇద్దరూ కూడా ఖండించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఈషా డియోల్, అహానా డియోల్ జన్మించారు. ఇందులో ఈషా డియోల్ హీరోయిన్ గా పాపులర్ కాగా అహానా డియోల్ సహ దర్శకురాలిగా పాపులర్ అయింది.

ఈషా డియోల్ నవంబర్ 2, 1982న జన్మించింది. 2002లో విడుదలైన కోయి మేరే దిల్ సే పూచే చిత్రంతో ఇషా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇషా ముంబైకి చెందిన వ్యాపారవేత్త భరత్ తఖ్తానీతో జూలై 29, 2012న పెళ్లి చేసుకుంది. ఈషా సోదరి అహానా డియోల్ జూలై 28, 1985న జన్మించింది. అహానా శిక్షణ పొందిన ఒడిస్సీ నృత్యకారిణి. 2014లో వ్యాపారవేత్త వైభవ్ కుమార్‌ను అహానా వివాహం చేసుకుంది.

ఇక ప్రస్తుతం ధర్మేంద్ర కి 13 మంది మనవడు, మనవరాలు ఉండటం విశేషం. ధర్మేంద్ర మనవడు, బాబీ డియోల్ కుమారుడు కు, ధర్మేంద్ర పేరు వచ్చేటట్టు “ధరమ్ సింగ్ డియోల్” అని పేరు పెట్టారు. 2019లో, ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ పాల్ పల్ దిల్ కే పాస్‌తో అరంగేట్రం చేశారు.

ఇలా తన స్వయంకృషితో వచ్చిన ఈ హీరో ఇప్పుడు తన ఫ్యామిలీ నుంచి ఎంతోమంది నటులను బాలీవుడ్ కి పరిచయం చేసి, తన కుటుంబం కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube