తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఫుల్ గ్లామర్ ఉన్న ఆంటీలకైతే సోషల్ మీడియాలో హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. అయితే, టాలీవుడ్ లో మోడ్రన్ మదర్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నేటి నటిమణుల్లో ‘సురేఖా వాణి’ ప్రముఖ నటి అనుకోవాలి. ఏజ్ అయిపోయినా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. సోషల్ మీడియాలో నిత్యం కొత్త కొత్త లుక్స్ లో కనిపిస్తూ మేకర్స్ కి తానేంటో చూపిస్తూ కొత్త అవకాలను అందుకుంటుంది సురేఖా.
Also Read: ఆటనాది.. కోటి మీది అంటున్న యంగ్ స్టార్…
కాగా హీరోయిన్లకు అలాగే స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న సురేఖ, త్వరలో ఆమె మెయిన్ లీడ్ గా ఓ వెబ్ సిరీస్ మొదలవుతుందని తెలుస్తోంది. పైగా ఈ వెబ్ సిరీస్ జీ5 సంస్థలో నిర్మించబోతున్నారట. అంటే ఒక రకంగా ఓటీటీ సినిమా అన్నమాట. మరి వెబ్ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ అంటే.. ఒక రకంగా సురేఖా వాణి హీరోయిన్ గానే చేయబోతుందట. ఇప్పటికీ కొత్త హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందంతో కనిపిస్తుంటుంది సురేఖా.
Also Read: ‘వకీల్ సాబ్’ హిస్టరీ రిపీట్ చేస్తాడా..?
మొత్తానికి తనలోని హీరోయిన్ ను లేట్ వయసులో చూపించబోతుంది. మరి ఆమె మెయిన్ లీడ్ గా చేయబోతున్న వెబ్ సిరీస్ ఏ రేంజ్ హిట్ ను అందుకుంటుందో చూడలి. ఇంతకీ సురేఖా వాణిని పెట్టి సినిమా తీస్తోన్న వాళ్ళు ఎవరంటే.. జీ.యల్ సురేందర్ అని, ఇతను గతంలో రవిబాబు మెయిన్ లీడ్ గా సితార అనే ప్లాప్ సినిమా తీశాడని తెలుస్తోంది. ఇప్పుడు తన రెండో సినిమాగా సురేఖాను పెట్టుకుని ఓ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
అయితే ఈ వెబ్ సిరీస్ సబ్జెక్ట్ మంచి సందేశాత్మకంగా ఉంటుందట. మరి ఏంటో.. ఆ కొత్త తరహా సందేశాత్మక చిత్రం ? చూడాలి. డ్యాన్స్ లతో, వర్కౌట్లతో మొత్తానికి యూత్ ను ఆకట్టుకుంటున్న సురేఖా వాణి లీడ్ రోల్ లో ఎలా నటిస్తోందో చూడాలి.