Sunny Leone: భర్త మోసాన్ని వీడియో తీసి పోస్ట్ చేసిన సన్నీ లియోన్… ఛీటర్ అంటూ ఆరోపణలు!

సన్నీ లియోన్ భర్త పేరు డానియల్ వెబర్. పరిశ్రమలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. 2011లో డానియల్ ని సన్నీ లియోన్ పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలను కన్నారు. ఒక ఆడ పిల్లను దత్తత తీసుకున్నారు. బాలీవుడ్ నటిగా మారాక ముంబైలోనే ఉంటున్నారు. కాగా సన్నీ లియోన్ తాజాగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఆమె తన భర్త మోసాన్ని రికార్డు చేశారు.

  • Written By: Shiva
  • Published On:
Sunny Leone: భర్త మోసాన్ని వీడియో తీసి పోస్ట్ చేసిన సన్నీ లియోన్… ఛీటర్ అంటూ ఆరోపణలు!

Sunny Leone: ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. సిక్కు ఫ్యామిలీలో పుట్టిన సన్నీ లియోన్ అసలు పేరు కరణ్ జీత్ కౌర్ వోహ్రా. కెనడాలో వీరి ఫ్యామిలీ స్థిరపడింది. చిన్నప్పటి నుండి మగరాయుడిలా పెరిగిన సన్నీ లియోన్ పోర్న్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ సంచలనాలు చేసింది. సన్నీ లియోన్ వరల్డ్ బెస్ట్ అండ్ టాప్ పోర్న్ స్టార్స్ లో ఒకరిగా పాప్యులర్ అయ్యారు. సన్నీ లియోన్ భర్త కూడా అదే పరిశ్రమలో ఉన్నాడు. ఇద్దరూ కలిసి పలు పోర్న్ వీడియోల్లో నటించారు.

సన్నీ లియోన్ భర్త పేరు డానియల్ వెబర్. పరిశ్రమలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. 2011లో డానియల్ ని సన్నీ లియోన్ పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలను కన్నారు. ఒక ఆడ పిల్లను దత్తత తీసుకున్నారు. బాలీవుడ్ నటిగా మారాక ముంబైలోనే ఉంటున్నారు. కాగా సన్నీ లియోన్ తాజాగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఆమె తన భర్త మోసాన్ని రికార్డు చేశారు.

కిచెన్ లో ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న డానియల్ విండో అద్దంలో సన్నీ లియోన్ దూరం నుండి గమనిస్తుంది. అతడు దొంగచాటుగా ఐస్ క్రీం తినడం అద్దంలో చూసింది. అసలు డానియల్ ఏం చెబుతాడో అని సన్నీ లియోన్ ‘ఏం చేస్తున్నావ్? ‘ అని అడిగింది. నేను వాటర్ తాగుతున్నాను, అని సమాధానం చెప్పాడు. నువ్వు ఐస్ క్రీం తినడం నేను చూశాను, అని సన్నీ నిలదీయడంతో డానియల్ షాక్ అయ్యాడు. నా మీద నువ్వు గూఢచర్యం చేస్తున్నావా? అని సన్నీ లియోన్ ని ప్రశ్నించాడు.

నా భర్త చీటింగ్ చేస్తున్నాడంటూ ఈ వీడియో సన్నీ లియోన్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 2012లో జిస్మ్ మూవీతో సన్నీ లియోన్ బాలీవుడ్ లో అడుగుపెట్టారు. తెలుగులో కరెంటు తీగ చిత్రంలో గెస్ట్ రోల్ చేశారు. గరుడ వేగ మూవీలో ఐటెం సాంగ్ తో అలరించింది. గత ఏడాది విడుదలైన జిన్నా మూవీలో సన్నీ లియోన్ నెగిటివ్ రోల్ చేసింది. పూర్తి స్థాయి పాత్రలో అలరించింది. ఈ చిత్రంలో ఆమె నటించిన జారు మిఠాయి సాంగ్ పాప్యులర్ అయ్యింది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు