సునీల్ కలర్ ఫోటో.. అదిరింది!

సునీల్ క‌మెడియ‌న్ గా, హీరోగా ప‌లు చిత్రాలు న‌టించి మెప్పించాడు. ఈరోజు సునిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా క‌ల‌ర్‌ఫోటో లుక్ ని విడుద‌ల చేశారు. ఈ సినిమాలో సునీల్ విలన్ నటిస్తున్నాడు. హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ కామెడిల‌తో మైండ్‌బ్లాక్ చేసిన‌ అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో ని లౌఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌జిలి, ఏజెంజ్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌, ప్ర‌తిరోజుపండ‌గ చిత్రాల్లో క‌మెడియన్ గా క్రేజ్ ని […]

  • Written By: Neelambaram
  • Published On:
సునీల్ కలర్ ఫోటో.. అదిరింది!

సునీల్ క‌మెడియ‌న్ గా, హీరోగా ప‌లు చిత్రాలు న‌టించి మెప్పించాడు. ఈరోజు సునిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా క‌ల‌ర్‌ఫోటో లుక్ ని విడుద‌ల చేశారు. ఈ సినిమాలో సునీల్ విలన్ నటిస్తున్నాడు. హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ కామెడిల‌తో మైండ్‌బ్లాక్ చేసిన‌ అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో ని లౌఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ‌జిలి, ఏజెంజ్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌, ప్ర‌తిరోజుపండ‌గ చిత్రాల్లో క‌మెడియన్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న సుహాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇత‌నికి జోడిగా తెలుగమ్మాయి చాందిని చౌదరి నటిస్తుంది. ఇందులో సునీల్ ఎస్ రామ‌రాజు పాత్ర‌లో త‌న విల‌నిజాన్ని పండించ‌నున్నాడ‌ట‌.

యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ మెట్ట‌మెద‌టిసారిగా దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇటీవ‌లే మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.కామెడీ ఎంటర్త్సైనర్ గా 1995 సంవ‌త్స‌రంలో ఒక ఇంజ‌నీరింగ్ కాలేజి లో జ‌రిగిన ప్రేమ‌క‌థగా రూపొందుతుంది.

సంబంధిత వార్తలు