
Ketika Sharma
Ketika Sharma: సంగీత దర్శకులందు సునిల్ కశ్యప్ వేరయ్యా అని అనొచ్చు. సునిల్ కశ్యప్.. ఈ పేరులోనే ఎంత వైవిధ్యం ఉందో.. అతని మ్యూజిక్ లో కూడా అంతే వైవిధ్యం ఉంటుంది. కాకపోతే, ఈ రోజు కావాల్సిన పని.. మరో పది రోజులకు అవుతుంది. అంత స్లోగా వర్క్ చేస్తాడు సునిల్ కశ్యప్. అయినా ఎవరి వర్కింగ్ స్టైల్ వాళ్ళది. కానీ సినిమా నిర్మాణం అనేది సమయపాలన పై ఆధారపడి ఉంటుంది. అందుకే సునిల్ కశ్యప్ కి టాలెంట్ ఉన్నా… ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
అయితే, ఆకాష్ పూరి హీరోగా, అందాల హీరోయిన్ కేతిక శర్మ(Ketika Sharma) హీరోయిన్ గా వస్తోన్న ‘రొమాంటిక్’ సినిమాకు సునిల్ కశ్యప్ సంగీతం అందించాడు. అయితే, ఈ సినిమా గురించి సునిల్ కశ్యప్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. మరి ఆ విషయాలు ఏమిటో చూద్దాం. తాము రొమాంటిక్ సినిమాకు సీరియస్ గా వర్క్ చేయలేదు అట.
సరదాగా కూర్చుని చేసిన పాటలే ఈ సినిమాలో పాటలు అని సునిల్ కశ్యప్ చెప్పుకొచ్చాడు. అయితే, దర్శకుడు అనిల్ పర్టిక్యులర్‌గా ఇలాంటి పాటలే కావాలి అంటూ దగ్గర ఉండి మ్యూజిక్ చేయించుకున్నాడట. ఇక రొమాంటిక్ టైటిల్ సాంగ్ కూడా ఒక్క రాత్రిలోనే కంపోజ్ చేశాడట. తానూ రొమాంటిక్ అయిపోయి ఈ సినిమా పాటలను కంపోజ్ చేశాడట. ఇక హీరోయిన్ కేతిక శర్మ అంటే.. సునిల్ కశ్యప్ కు ప్రత్యేక అభిమానం అట.
అందుకే, రొమాంటిక్ సినిమాలో కేతిక శర్మ చేత బలవంతంగా ఓ పాట పాడించాడు. ఆ పాటే ‘నా వల్ల కాదే’ అనే పాట, సోషల్ మీడియాలో ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. దాంతో కేతిక శర్మ నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆకాష్ నటన గురించి కూడా సునిల్ కశ్యప్ గొప్పగా చెప్పాడు. నటన పరంగా ఆకాష్ బాగా ఎదిగాడు అని, ఈ సినిమాకు ఆర్ఆర్ చేసేటప్పుడు ఆ విషయం తనకు అర్థమైందని సునిల్ కశ్యప్ తెలియజేశాడు.
అన్నిటికీ మించి ఈ చిత్రంలో గొప్ప ఎమోషనల్ కంటెంట్ ఉందట.. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోందట. ఇక పూరి, ఛార్మీలతో పాటు తాను ఒక చోట కలిస్తే.. ఎంతో సరదాగా ఉంటామని, నేను గిటార్ పట్టుకుని వాయిస్తుంటాను. అప్పుడు అందరం సరదాగా ఎంజాయ్ చేస్తామని సునిల్ కశ్యప్ చెప్పాడు.