MS Dhoni : ఇక హెడ్ కోచ్ గా ధోని.. టీమిండియా తలరాత మార్చేస్తాడా!?
ధోనికి సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా లేదా, టీమ్ హెడ్ కోచ్‌గా కానీ, లేదా కోచింగ్ స్టాఫ్ హెడ్‌గా బీసీసీఐలో కీలకమైన పదవి దక్కుతుంది. ధోనికి ఉన్న అనుభవం, విలువైన సూచనలు, సలహాలు, నాయకత్వ పటిమ జట్టుకు చాలా అవసరం. ధోనీ అనుభవం టీమిండియా ఆధిపత్యాన్ని సుస్థిరం చేస్తుంది అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

MS Dhoni : భారత క్రికెట్ జట్టు కోచ్‌గా టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహింద్ర సింగ్ ధోని బాధ్యతలు చేపట్టబోతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది క్రికెట్ వర్గాల నుంచి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో టీమిండియా హెడ్ కోచ్‌గా జార్ఖండ్ డైనమేట్‌ను చూడడం ఖాయం.
ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన..
ప్రపంచ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ధోనీ ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన ధోని సారథ్యంలోని చెన్నై టీమ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చెన్నై మరో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్న మహీ టీమిండియా హెడ్ కోచ్‌గా రావాలని పలువురు మాజీలు, క్రికెట్ అభిమానులు కోరకుంటున్నారు.
హింట్ ఇచ్చిన గవాస్కర్..
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. టీమిండియా హెడ్ కోచ్‌గా ధోని వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఓ చిన్న హింట్ ఇచ్చాడు. ఇటీవల స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ఎంఎస్ ధోనీ త్వరలోనే టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టవచ్చు. అది తప్పక జరగాలని అనుకుంటున్నాను. టీమ్ కోసం ఏదైనా బాధ్యతలు తీసుకునే ముందు కొంత విశ్రాంతి కావాలనేది నా భావన. అది సెలక్షన్ కమిటీ, మేనేజర్, హెడ్ కోచ్.. ఏదైనా కొంత విశ్రాంతి కావాలి. ఎంఎస్ ధోనీకి ఆ విశ్రాంతి లభించింది. ఇంకా ధోనికి సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా లేదా, టీమ్ హెడ్ కోచ్‌గా కానీ, లేదా కోచింగ్ స్టాఫ్ హెడ్‌గా బీసీసీఐలో కీలకమైన పదవి దక్కుతుంది. ధోనికి ఉన్న అనుభవం, విలువైన సూచనలు, సలహాలు, నాయకత్వ పటిమ జట్టుకు చాలా అవసరం. ధోనీ అనుభవం టీమిండియా ఆధిపత్యాన్ని సుస్థిరం చేస్తుంది అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
వరల్డ్ కప్ తర్వాత మార్పు..
ప్రస్తుతం టీం ఇండియా కెప్టెన్‌గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నారు. 2021 నవంబర్‌లో ఆయన రవిశాస్త్రి వారసుడిగా టీం ఇండియా హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా మిశ్రమ ఫలితాలు సాధిస్తోంది. 2023 అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. అప్పటి వరకు ద్రవిడే కోచ్‌గా కొనసాగనున్నారు. ఆ తర్వాత కోచ్ మారే అవకాశం ఉంది. ఆయన వారసుడిగా వీవీఎస్.లక్ష్మణ్ వస్తారని ప్రచారం జరిగింది. అయితే సన్నీ ఇచ్చిన హింట్‌తో టీమిండియా కెప్టెన్‌గా ధోనీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భారత క్రికెట్ అభిమానులు, ధోని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అదే జరగాలను పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.
