Suma: వాళ్ళను చూసి సుమ కూడా అదే పని చేస్తుంది… ఈ వయసులో అవసరమా?
ఈ మధ్య ఆమె షోలు తగ్గించారు. సుమ అడ్డాతో పాటు ఒకరి రెండు షోలు మాత్రమే చేస్తున్నారు. ఒక దశలో యాంకరింగ్ వదిలేస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. అయితే సుమ తనలోని సరికొత్త కోణం ఆవిష్కరిస్తుంది.

Suma: యాంకరింగ్ లో సుమ కనకాల లెజెండ్ అనడంలో సందేహం లేదు. రెండు దశాబ్దాలుగా ఆమె నెంబర్ వన్ తెలుగు యాంకర్ గా ఉన్నారు. సమయస్ఫూర్తి, భాషలపై పట్టు, ఎనర్జీ ఆమెను ప్రత్యేకంగా మార్చేశాయి. పదుల సంఖ్యలో బుల్లితెర చేసిన సుమ వందల సినిమా ఈవెంట్స్, వేల ఇంటర్వ్యూలు చేశారు. ఇప్పటికీ సుమ క్రేజ్ తగ్గలేదు. సుమకు పోటీగా పలువురు గ్లామరస్ యాంకర్స్ వచ్చారు. ఆమె స్థానాన్ని మాత్రం దక్కించుకోలేకపోయారు.
ఈ మధ్య ఆమె షోలు తగ్గించారు. సుమ అడ్డాతో పాటు ఒకరి రెండు షోలు మాత్రమే చేస్తున్నారు. ఒక దశలో యాంకరింగ్ వదిలేస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. అయితే సుమ తనలోని సరికొత్త కోణం ఆవిష్కరిస్తుంది. ఆమె మెస్మరైజ్ చేసే ఫోటో షూట్స్ చేస్తుంది. నిండైన ట్రెండీ బట్టల్లో గ్లామరస్ గా కనిపించే ప్రయత్నం చేస్తుంది. సుమ నుండి ఇది ఊహించని పరిణామం. ట్రెండ్ కి ఎవరూ అతీతులు కాదు. సుమ కూడా ఫాలో కావాల్సిందే అనిపిస్తుంది.
ఇంస్టాగ్రామ్ వేదికగా సుమ ఫోటో షూట్స్ చేస్తుంటే ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియా అభిమానులకు టచ్ లో ఉండేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. తమను జనాలు మర్చిపోకుండా ఉండేదుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ కారణంతో కూడా సుమ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇక సుమ కెరీర్ నటిగా మొదలైంది. సుమ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ చేశారు.
అయితే సక్సెస్ కాలేదు. దాంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. నటుడు రాజీవ్ కనకాలను సుమ ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళికి ముందు నటన మానేయాలని రాజీవ్ కనకాల కండిషన్ పెట్టాడట. అందుకు ఒప్పుకోని సుమ గుడ్ బై చెప్పేసిందట. తర్వాత రాజీవ్ మెత్తబడ్డాడట. నీ కెరీర్ నీ ఇష్టం, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడట. వీరికి అబ్బాయి, అమ్మాయి సంతానం కాగా.. కొడుకును హీరో చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
View this post on Instagram
