Sudigali Sudheer SS4 : కొత్త మూవీ షురూ చేసిన సుడిగాలి సుధీర్… ఎంత సింపుల్ గా వచ్చాడో చూడండి!
సుడిగాలి సుధీర్ కెరీర్లో ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తి దాయకం. మెజీషియన్ అయిన సుధీర్ జబర్దస్త్ లో అడుగుపెట్టాడు. అక్కడ ఆయన దశ తిరిగింది.

Sudigali Sudheer SS4 : సుడిగాలి సుధీర్ జోరు మామూలుగా లేదు. ఆయన కొత్త మూవీ షురూ చేశారు. బుల్లితెరకు దూరమైన సుడిగాలి సుధీర్ హీరోగా బిజీ అవుతున్నారు. ఆయనకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. గాలోడు విజయం సాధించిన నేపథ్యంలో మేకర్స్ ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీతో హీరోగా మారిన సుధీర్ మూడో చిత్రం గాలోడుతో సక్సెస్ కొట్టాడు. గత ఏడాది విడుదలైన గాలోడు ఊహించని వసూళ్లు రాబట్టింది. మిక్స్డ్ టాక్ మధ్య సంచలన విజయం అందుకుంది.
సుడిగాలి సుధీర్ లో దమ్ముందని గాలోడు మూవీ నిరూపించింది. ఆయనకంటూ అభిమానగణం, సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారని రుజువైంది. మే 12న సుడిగాలి సుధీర్ కొత్త మూవీ స్టార్ట్ చేశారు. పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాగల్ అంతగా ఆడకున్నా పర్లేదు అనిపించుకుంది. దీంతో సుడిగాలి సుధీర్ ఈ యంగ్ డైరెక్టర్ తో మూవీ చేసేందుకు పచ్చజెండా ఊపాడు. సుధీర్ నాలుగో చిత్రంగా ఇది తెరకెక్కనుంది. దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ మూవీ పూజా కార్యక్రమానికి సుడిగాలి సుధీర్ చాలా సింపుల్ గా వచ్చారు. తెల్లని లాల్చీ పైజామాలో ట్రెడిషనల్ వేర్లో ఈవెంట్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం కావడంతో సుధీర్ ఇలా సిద్ధమయ్యారు. కారులోంచి దిగగానే సుధీర్ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుధీర్ అన్నా నువ్వు దేవుడు అంటూ కేకలు వేశారు. ఇది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటో తెలియజేస్తుంది.
సుడిగాలి సుధీర్ కెరీర్లో ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తి దాయకం. మెజీషియన్ అయిన సుధీర్ జబర్దస్త్ లో అడుగుపెట్టాడు. అక్కడ ఆయన దశ తిరిగింది. టీం మెంబర్ నుండి టీమ్ లీడర్ అయ్యాడు. ఇక ఢీ షో వేదికగా తన మల్టీ టాలెంట్స్ చూపిస్తూ అభిమానులను సొంతం చేసుకున్నాడు. బుల్లితెర స్టార్ గా అవతరించాడు. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. సుడిగాలి సుధీర్ గతంలో సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో నటించారు. గాలోడు మూవీతో ఆయనకు హీరోగా బ్రేక్ వచ్చింది.
