నానితో పోటీకి సై అంటున్న కుర్ర హీరో

హీరో నానితో ఓ కుర్రహీరో పోటీకి సై అంటున్నాడు. హీరో నాని, సుధీర్ బాబు కలిసి నటించిన ‘వీ’ మూవీ ఉగాది పండుగ(మార్చి 25)న విడుదల కానుంది. ఈ మూవీ విడుదలరోజే కుమారి 21ఎఫ్ ఫ్రేం హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ రిలీజ్ అవుతుంది. ఉగాది రోజున వీరిద్దరు పోటీ సై అనడంతో సందడి నెలకొంది. పండుగ రోజు కావడంతో స్టార్ హీరోల పోటీ ఉంటుంది. కానీ ఈసారి స్టార్ హీరోలంతా సంక్రాంతికి, వేసవిని […]

  • Written By: Neelambaram
  • Published On:
నానితో పోటీకి సై అంటున్న కుర్ర హీరో

హీరో నానితో ఓ కుర్రహీరో పోటీకి సై అంటున్నాడు. హీరో నాని, సుధీర్ బాబు కలిసి నటించిన ‘వీ’ మూవీ ఉగాది పండుగ(మార్చి 25)న విడుదల కానుంది. ఈ మూవీ విడుదలరోజే కుమారి 21ఎఫ్ ఫ్రేం హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ రిలీజ్ అవుతుంది. ఉగాది రోజున వీరిద్దరు పోటీ సై అనడంతో సందడి నెలకొంది. పండుగ రోజు కావడంతో స్టార్ హీరోల పోటీ ఉంటుంది. కానీ ఈసారి స్టార్ హీరోలంతా సంక్రాంతికి, వేసవిని టార్గెట్ చేశారు. దీంతో ఉగాదికి పెద్ద హీరోల సినిమాలు రావడం లేదు. ఎవరులేని టైంలో సాలీడ్ హిట్టు కొడుతామనుకున్న ‘వి’ మూవీకి ‘ఒరేయ్ బుజ్జిగాడు’ షాక్ ఇచ్చాడు. తాము కూడా ఉగాదికే వస్తున్నామని ప్రకటించేశారు.

‘వీ’ మూవీలో నాని నెగిటిల్ షెడ్ ఉన్న పాత్రలో కన్పించబోతున్నాడు. ఇందులో సుధీర్ బాబు రక్షకుడిగా, నాని రాక్షసుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఫస్టు లుక్, ట్రైలర్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ‘వీ’ మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ మూవీని మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నాడు. ఈమూవీలో ఆదితిరావు హైదరీ, నివేథా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో నానికి ‘వీ’ మూవీ 25 చిత్రం కావడం విశేషం.

‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీకి విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్ తరుణ్ హీరో కెకె.రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. మాళవికా నాయక్, హెబ్బా పటేల్ నటిస్తున్నారు. ఏప్రిల్ 3న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఉగాది రోజున పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు తెల్సింది. కేవలం రెండు సినిమాలే విడుదలవుతుండటంతో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. పండుగ వాతావరణంలో ఈ మూవీలకు పాజిటివ్ టాక్ వస్తే మరింత షేర్ దక్కించుకునే అవకాశం ఉంది. పెద్దగా పోటీలేకపోవడంతో ఈ మూవీలకు కలెక్షన్లు కలిసిచ్చేలా ఉన్నాయి.

సంబంధిత వార్తలు