T Subbarami Reddy: విశాఖలో టి.సుబ్బిరామిరెడ్డి సడెన్ ఎంట్రీ.. కారణం అదేనా?
విశాఖపట్నం పార్లమెంటు స్థానం అనేసరికి అది వలస పక్షుల కేంద్రంగా అంతా భావిస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా విశాఖ పార్లమెంట్ స్థానానికి స్థానికేతరులే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు.

T Subbarami Reddy: తెలుగు ప్రజలకు టి. సుబ్బిరామిరెడ్డి సుపరిచితులు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్న ఆ యన ఇటీవలే సిడబ్ల్యూసి సభ్యుడిగా నామినేట్ అయ్యారు. గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఆయన ఉన్నట్టుండి విశాఖ రావడం చర్చనీయాంశంగా మారుతుంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన విశాఖలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. దాని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు సమాచారం.
విశాఖపట్నం పార్లమెంటు స్థానం అనేసరికి అది వలస పక్షుల కేంద్రంగా అంతా భావిస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా విశాఖ పార్లమెంట్ స్థానానికి స్థానికేతరులే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు.1998, 99 లో సుబ్బిరామిరెడ్డి విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటినుంచి ఆయనకు విశాఖతో అనుబంధం ఏర్పడింది. రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత కూడా విశాఖ నుంచి సుబ్బరామిరెడ్డి రాజకీయాలు నడిపేవారు. విశాఖ కేంద్రంగానే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. విశాఖ నగరవాసుల మన్ననలు పొందారు. కానీ 2014 తర్వాత.. కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో కనిపించకుండా పోయారు. సడన్ గా ప్రత్యేక విమానంలో విశాఖ రావడం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు సుబ్బిరామిరెడ్డి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో అత్యంత శక్తివంతమైన సిడబ్ల్యుసి లో సుబ్బిరామిరెడ్డికి ఇటీవల సభ్యత్వం లభించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి విస్తృతం అవుతోంది. ఆయా రాష్ట్రాల్లో బావ సారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోనుంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇండియా కూటమి వైపు అడుగులేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఏపీలో కీలక స్థానాల నుంచి కాంగ్రెస్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే సుబ్బిరామిరెడ్డి విశాఖ పై ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. 2024 ఫిబ్రవరిలో శివరాత్రి వేడుకల ద్వారా సుబ్బిరామిరెడ్డి విశాఖలో పొలిటికల్ హీట్ పెంచనున్నట్లు తెలుస్తోంది.
