
Salaar Movie Rights
Salaar Movie Rights: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు మరియు ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘సలార్’.KGF సిరీస్ వంటి బాక్స్ ఆఫీస్ బోనాంజాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి అందించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం తో అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు అన్నీ చివరి దశకి చేరుకున్నాయి.
ఇటలీ షెడ్యూల్ మినహా మూవీ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యినట్టు, ఈ నెలాఖరు తో సినిమా టాకీ పార్ట్ మొత్తం అయిపోతుందని, ముందు అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 28 వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. శృతి హాసన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, మలయాళం టాప్ స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్ర ని పోషిస్తున్నాడు.

Salaar Movie Rights
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ కనీవినీ ఎరుగని రేంజ్ రికార్డు రేట్ కి అమ్ముడుపోగా, తెలుగు రాష్ట్రాలలో కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుండే వంద కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. 100 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ కొంతమంది స్టార్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి కూడా జరగడం లేదు. అలాంటిది కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుండే ఈ రేంజ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగడం ఇదే తొలిసారి.
కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే ఇప్పటి వరకు ఈ రేంజ్ బిజినెస్ జరిగింది. మొట్టమొదటిసారి ఒక నాన్ రాజమౌళి సినిమాకి అదే రేంజ్ డిమాండ్ ఉండడాన్ని చూసి విమర్శకులు సైతం నోరెళ్లబెడుతున్నారు.ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పవర్ అలాంటిది మరి. విడుదలకు ముందే ఈ రేంజ్ ఉంటే , విడుదల తర్వాత ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.