STR48: బ్రేకింగ్… కమల్-శింబు కాంబోలో భారీ ప్రాజెక్ట్!
శింబు కెరీర్లో ఇది స్పెషల్ మూవీ కానుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటిసారి కమల్ హాసన్-శింబు ఓ చిత్రానికి చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

STR48: హీరో శింబు క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. తన 48వ చిత్రంపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చారు. తాజా ప్రకటన శింబు ఫ్యాన్స్ లో జోష్ నింపింది. కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న శింబుకు తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఆయన హీరోగా తెరకెక్కిన మన్మధ అప్పట్లో సెన్సేషన్. ఈ మధ్య తెలుగులో ఆయన జోరు తగ్గింది. కోలీవుడ్ లో మాత్రం దూసుకుపోతున్నారు. ఆయన పడి లేచాడు. శింబు హీరోగా తెరకెక్కిన మన్నాడు చిత్రం భారీ విజయం సాధించింది.
తాజా ఆయన లోకనాయకుడు కమల్ హాసన్ తో చేతులు కలిపాడు. ఆయన నిర్మాతగా కొత్త చిత్రం ప్రకటించారు. శింబు హీరోగా రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్లో మూవీ తెరకెక్కనుంది. నేడు అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రానికి దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లడ్ అండ్ బాటిల్ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు.
శింబు కెరీర్లో ఇది స్పెషల్ మూవీ కానుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటిసారి కమల్ హాసన్-శింబు ఓ చిత్రానికి చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో షూటింగ్ మొదలుకానుండగా వచ్చే ఏడాది విడుదలయ్యే సూచనలు కలవు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారని సమాచారం.
కాగా కమల్ హాసన్ విక్రమ్ మూవీతో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చారు. విక్రమ్ దాదాపు నాలుగు వందల కోట్ల వసూళ్లు సాధించింది. విక్రమ్ మూవీకి కమల్ హాసన్ నిర్మాత కూడాను. ఆ సినిమాకు వచ్చిన డబ్బులతో అప్పులు కట్టేస్తానని కమల్ హాసన్ ఓపెన్ గా ప్రకటించారు. ఆ చిత్ర లాభాలతోనే ఆయన ఇతర హీరోలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్లో పాల్గొంటున్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించారు.
An alliance forged to push frontiers of success & across generations! #STR48 #Ulaganayagan #KamalHaasan #Atman #SilambarasanTR #BLOODandBATTLE #RKFI56_STR48@ikamalhaasan @SilambarasanTR_ @desingh_dp #Mahendran @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/4i7uawXwHG
— Raaj Kamal Films International (@RKFI) March 9, 2023
