Sara Ali Khan: స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తుంది. హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కూతురే సారా అలీ ఖాన్. సైఫ్ హీరోయిన్ అమృతా సింగ్ తో విడిపోయాక కరీనా కపూర్ ని రెండో వివాహం చేసుకున్నారు. సైఫ్-అమృతా సింగ్ లకు ఒక అమ్మాయి, అబ్బాయి. బాల్యం నుండి సారా చాలా బొద్దుగా ఉండేది. పెద్దయ్యాక కూడా ఆమెను ఊబకాయం వదల్లేదు. హీరోయిన్ కావాలనే ఆశతో సారా పట్టుదలగా బరువు తగ్గింది. సగానికి సగం సన్నబడింది. ఆ విధంగా 2018లో విడుదలైన కేదార్ నాథ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు.

Sara Ali Khan
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆ చిత్ర హీరో. కేదార్ నాథ్ హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. తర్వాత రణ్వీర్ సింగ్ కి జంటగా సింబా చిత్రం చేశారు. సింబా సైతం హిట్ కొట్టింది. తర్వాత చేసిన లవ్ ఆజ్ కల్, కూలీ నంబర్ వన్ చిత్రాలు ఆమెకు షాక్ ఇచ్చాయి. అనుకున్న స్థాయిలో ఆ చిత్రాలు ఆడలేదు. దీంతో సారా కొంచెం నిరాశకు గురయ్యారు.
గత ఏడాది అత్రాంగిరే టైటిల్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ చేసింది. ధనుష్, అక్షయ్ కుమార్ హీరోలుగా చేసిన ఈ మూవీ నేరుగా హాట్ స్టార్ లో విడుదలైంది. అత్రాంగిరే హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ముఖ్యంగా సారా నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం సారా అలీ ఖాన్ చేతిలో మరో రెండు హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Sara Ali Khan
కాగా సారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. హాట్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తారు. తాజాగా ఆమె బికినీ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. విశేషం ఏమిటంటే ఆమె బికినీలో సైకిల్ తొక్కుతున్నారు. బీచ్ లైఫ్ చాలా బాగుంటుంది. అన్ని టెన్షన్స్ మరిచిపోవచ్చు అని, సదరు ఫోటోలకు సారా కామెంట్ పోస్ట్ చేశారు. సాగర తీరం అంటే సారాకు చాలా ఇష్టమని అర్థం అవుతుంది.
హీరోయిన్ గా సారా సాధించాల్సింది చాలా ఉంది. అయితే ఆమెపై తరచుగా ఎఫైర్ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పాటు, హీరో కార్తీక్ ఆర్యన్ ఇలా పలువురు ఆమెతో ఎఫైర్ నడిపినట్లు సమాచారం. కాగా డ్రగ్స్ కేసులో సారా విచారణ ఎదుర్కొంది. దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్, శ్రద్దా కపూర్ లతో పాటు సారా విచారణకు హాజరయ్యారు.