Tamannaah Wedding : జైలర్ దెబ్బకు వాయిదా పడ్డ స్టార్ తమన్నా పెళ్లి!
ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న తరుణంలో తమన్నా మాటలు వింటే కొంచెం ఆశ్చర్యం కలిగించటం ఖాయం.

Tamannaah Wedding : తమన్నా సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు. దాదాపు 2 దశాబ్దాల గా సినీ రంగంలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ మిల్క్ బ్యూటీ ఇప్పటికి కూడా రేస్ లో ముందు వరుసలో దూసుకెళ్తుంది. రీసెంట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లో హీరోయిన్ గా నటించిన తమన్నాకు ఆ సినిమా అనుకున్న పేరు తీసుకుని రాలేకపోయిన కానీ ఆమె నటించిన జైలర్ ఊహించని క్రేజ్ ను తీసుకొని వచ్చింది.
ఆ సినిమాలో కేవలం ఒక పాట, రెండు మూడు సన్నివేశాల్లో నటించిన కానీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ‘నువ్వు కావాలయ్యా’ అనే ఒకే ఒక్క పాటతో సినిమాపై భారీ అంచనాలు పెంచింది తమన్నా. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో జైలర్ సినిమా వస్తుందనే విషయం తెలిసిందే తమన్నా పాట ద్వారా. ప్రస్తుతం జైలర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న తమన్నా తన పర్సనల్ లైఫ్ గురించి ప్రొఫెషనల్ లైఫ్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఓపెన్ గా మాట్లాడింది.
నటుడు విజయ్ వర్మ తో తమన్నా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు పబ్లిక్ గానే తమ రిలేషన్ గురించి ప్రకటించారు. ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న తరుణంలో తమన్నా మాటలు వింటే కొంచెం ఆశ్చర్యం కలిగించటం ఖాయం. రీసెంట్ ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి ఒక ప్రశ్న ఎదురుకాగానే ” పెళ్లి వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉందని, ఒక దశలో వివాహం చేసుకోవాలని భావించానని, అయితే ప్రస్తుతం అలాంటి మానసిక పరిస్థితి లేదని ” తేల్చి చెప్పింది తమన్నా .
అదే విధంగా “ప్రస్తుతం నా నటన జీవితం బాగా సాగుతుందని, కాబట్టి ప్రస్తుతం నా దృష్టంతా సినిమా మీద ఉందని, సరికొత్త కధల్లో నటించే అవకాశం వస్తుందని, అలాంటి వాటిని అంగీకరిస్తున్నా, ప్రస్తుతానికి షూటింగ్ ప్లేస్ నాకు బాగా ఆనందాన్ని ఇస్తుందని” తెలిపింది తమన్నా. దీనిని బట్టి చూస్తుంటే ఈ మిల్క్ బ్యూటీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలుస్తుంది. జైలర్ మూవీ వలన అవకాశాలు మళ్ళి పెరగడంతోనే పెళ్లి వాయిదా వేసుకుంది కాబోలు ఈ హాట్ బ్యూటీ.
