Aamir Khan: బాలీవుడ్ లో ఆధిపత్యం ఖాన్ త్రయందే. అమితాబ్ తర్వాత ఆధిపత్యం ఈ ముగ్గురిదే. షారుక్, సల్మాన్, అమీర్ హిందీ చిత్ర పరిశ్రమను శాసించారు. ఒకరికి మించి మరొకరు ఇండస్ట్రీ హిట్స్ అందించారు. అదంతా గతం. కొన్నాళ్లుగా వీరికి బ్యాడ్ టైం నడుస్తుంది. షారుక్ అయితే హిట్ కొట్టి పదేళ్లు కావస్తుంది. 2013లో విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత షారుక్ ఖాన్ సక్సెస్ చూడలేదు. సల్మాన్ పరిస్థితి కూడా అంతే భజరంగీ భాయ్ జాన్ రేంజ్ హిట్ మళ్ళీ తగల్లేదు. ఆయన గత రెండు చిత్రాలు దబాంగ్ 3, రాధే ఘోర పరాజయం పొందాయ

Aamir Khan
గ్యారంటీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ సైతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సీక్రెట్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చివరి హిట్ మూవీ. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్ రిజల్ట్ చవిచూశాయి. ఎప్పుడో 1994లో విడుదలైన ఫారెస్ట్ గంప్ చిత్రాన్ని రీమేక్ చేసి అమీర్ నిండా మునిగాడు. స్క్రిప్ట్ జడ్జిమెంట్ లో తోపు అనిపించుకున్న అమీర్ ఖాన్ కి ఈ రేంజ్ పరాభవం ఊహించనిదే. లాల్ సింగ్ చడ్డా చిత్రానికి అమీర్ నిర్మాత కూడాను.
ఒక దశలో అమీర్ కి గోల్డెన్ ఎరా నడిచింది. అందరూ టాప్ స్టార్స్ ని అమీర్ క్రాస్ చేసి నంబర్ వన్ పొజిషన్ సొంతం చేసుకున్నారు. గజినీ, 3 ఇడియట్స్, పీకే, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ బాలీవుడ్ ని శాసించాయి. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ చైనాలో సైతం భారీ వసూళ్లు రాబట్టాయి. అలాంటి అమీర్ ఖాన్ కూడా బాక్సాఫీస్ వద్ద తడబడ్డాడు. వేల కోట్ల వసూళ్ల చిత్రాల హీరో కనీస ప్రభావం చూపలేకపోయారు.

Aamir Khan
ఈ క్రమంలో అమీర్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు. సినిమా నుండి విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఫ్యామిలీకి సమయం కేటాయించడానికే ఈ నిర్ణయం అన్నారు. 35 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో అలసట లేకుండా పని చేశాను. దీని వలన నేను ఏదో కోల్పోయానన్న భావన కలిగింది. ఏడాదిన్నర పాటు కెమెరా ముందు రాను. పూర్తి సమయం నా తల్లి, పిల్లలతో గడిపేందుకు కేటాయిస్తాను, అని అమీర్ ఖాన్ అన్నారు. తాను హీరోగా తెరకెక్కుతున్న ఛాంపియన్ మూవీ నుండి కూడా అమీర్ తప్పుకున్నట్లు ప్రకటించారు. తన స్థానంలో మరొక హీరో వస్తాడు. ఆ చిత్ర నిర్మాత నేనే కాబట్టి ఎలాంటి సమస్య లేదని చెప్పారు. కాగా గత ఏడాది అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ తో విడాకులు ప్రకటించారు. వీరికి ముగ్గురు సంతానం.