Sreemukhi Marriage: సింగిల్ గా ఇదే లాస్ట్ బర్త్ డే… పెళ్ళికి సిద్ధమైన స్టార్ యాంకర్ శ్రీముఖి?
హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను శ్రీముఖి వివాహం చేసుకోబోతున్నారట. చాలా కాలంగా వీరు రిలేషన్ లో ఉన్నారట. ఇరు కుటుంబాల పెద్దలకు కూడా వివాహం సమ్మతమేనట. త్వరలో శ్రీముఖి పెళ్లి భాజా మోగనుందట. ఆ వ్యాపారవేత్తకు వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

Sreemukhi Marriage: సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ప్రేమలు, పెళ్లిళ్ల వ్యవహారమైతే మరీనూ. యాంకర్ శ్రీముఖి పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. థర్టీ ప్లస్ లో అడుగుపెట్టిన శ్రీముఖి పెళ్లిపై తరచుగా పుకార్లు చక్కర్లు కొడుతుంటాయి. గతంలో శ్రీముఖి ఓ సందర్భంలో ముప్పై దాటాక పెళ్లి చేసుకుంటానని చెప్పారు. దీంతో శ్రీముఖి వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది.
హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను శ్రీముఖి వివాహం చేసుకోబోతున్నారట. చాలా కాలంగా వీరు రిలేషన్ లో ఉన్నారట. ఇరు కుటుంబాల పెద్దలకు కూడా వివాహం సమ్మతమేనట. త్వరలో శ్రీముఖి పెళ్లి భాజా మోగనుందట. ఆ వ్యాపారవేత్తకు వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఈ బర్త్ డేకు శ్రీముఖి కీలక నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి కదా, అని పెళ్ళికి ఫిక్స్ అయ్యారట.
మే 10న శ్రీముఖి బర్త్ డే. విదేశాల్లో తన జన్మదిన వేడుకలు జరుపుకుంటుంది. ప్రస్తుతం ఆమె థాయిలాండ్ లో ఉన్నారు. బంధు మిత్రులతో అక్కడకు చెక్కేశారు. బర్త్ డే వేడుకలు ముగిసిన అనంతరం ఆమె తిరిగి ఇండియా రానున్నారు. ఇక శ్రీముఖి కెరీర్ పరిశీలిస్తే… జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి టాప్ యాంకర్ పొజీషన్ సొంతం చేసుకున్నారు. షోస్ పరంగా చూస్తే సుమ, రష్మీలను కూడా ఆమె వెనక్కి నెట్టారు.
అదే సమయంలో హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. క్రేజీ అంకుల్స్, ఇట్స్ టైం టు పార్టీ చిత్రాల్లో శ్రీముఖి హీరోయిన్ గా విశేషం. అవి చిన్న చిత్రాలు కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఇకపై కొంచెం పేరున్న దర్శకులు, నటులతో పని చేయాలని శ్రీముఖి డిసైడ్ అయ్యారట. అందుకే ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటున్నారట. భోళా శంకర్ మూవీలో శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
