Srinu Vaitla : కామెడీ సినిమాలు తీయడంలో జంధ్యాల గారు తెలుగు సినిమా ఆడియన్స్ లో ఒక చెరగని ముద్ర వేసి వెళ్లారు..ఆయన సినిమాలు చూసి ఒక మూడు గంటలపాటు మన జీవితాల్లో ఉన్న కష్టాలను మర్చిపోయి మనస్ఫూర్తిగా నవ్వుకొని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం..ఆయన తర్వాత అంతటి హాస్యాన్ని పంచిన దర్శకుడు ఎవరైనా నేటి తరంలో ఉన్నారా అంటే అది శ్రీను వైట్ల మాత్రమే అని చెప్పేయొచ్చు.
ఈయన తీసిన ప్రతీ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే విధంగానే ఉంటాయి..సొంతం , వెంకీ, దుబాయ్ శ్రీను, కింగ్ , ఢీ , రెడీ , దూకుడు ఇలా ఒక్కటా రెండా ఆయన కెరీర్ లో ఇలాంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి..ఇప్పటికీ ఆయన సినిమాల్లోని సన్నివేశాలను మేమెర్స్ కామెడీ కోసం వాడుతూనే ఉంటారు..అది శ్రీను వైట్ల నేటి తరం ఆడియన్స్ మీద కలిగించిన ప్రభావం.
అయితే ఇప్పుడు ఆ శ్రీను వైట్ల కి అవకాశాలు లేక ఖాళీగా ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. దూకుడు సినిమా తర్వాత ఆయన చేసిన ‘బాద్షా’ ఒక్కటే కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది.. ఆ తర్వాత వచ్చిన ‘ఆగడు’,’బ్రూస్ లీ’ , ‘మిస్టర్’,’అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి సినిమాలు ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ అవ్వడం తో శ్రీను వైట్ల కెరీర్ ఎండ్ అయిపోయింది.. ఆయన కెరీర్ ఇలా అయిపోవడానికి కారణం ఒకప్పుడు తనతో పాటు ఉన్న టీం ఇప్పుడు లేకపోవడమే. కోన వెంకట్ – గోపి మోహన్ లు.. శ్రీనువైట్ల నుండి బాద్షా సినిమా తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు.
ఇక ఆ తర్వాత శ్రీను వైట్ల రైటింగ్ టీంలో మొదటి నుండి ఉంటూ వస్తున్న అనిల్ రావిపూడి ఇప్పుడు బయటకి వచ్చేసి పెద్ద డైరెక్టర్ గా మారిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే..ఇలా మొదటి నుండి శ్రీను వైట్లకి ఆయువు పట్టులాగా ఉంటూ వస్తున్న వాళ్ళు ఒక్కొక్కరిగా విడిపోవడం తో ఆయన కెరీర్ ముగిసిందని విశ్లేషకులు అంటున్నారు.