Gopichand- Srinu Vaitla: బద్ద శత్రువులని ఒకటి చేసిన హీరో గోపీచంద్.. ఇది నిజంగా ఎవ్వరు ఊహించనిది
Gopichand- Srinu Vaitla: జంధ్యాల మరియు EVV సత్యనారాయణ వంటి లెజండరీ కామెడీ డైరెక్టర్స్ తర్వాత అదే రేంజ్ క్రేజ్ మరియు బ్రాండ్ ఇమేజి ని సంపాదించుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల..ఈయన తీసిన సినిమాల్లో అధిక సాటాహం సూపర్ హిట్ సాధించిన సినిమాలే ఎక్కువే..వెంకీ , దుబాయి శ్రీను , ఢీ , దూకుడు ,రెడీ ఇలా ఒక్కటా రెండా ఎన్నో బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చిన ఘనత ఆయనది..సోషల్ ఇండియా లో ఇప్పటికి ఆయన సినిమాల్లోని […]

Gopichand- Srinu Vaitla: జంధ్యాల మరియు EVV సత్యనారాయణ వంటి లెజండరీ కామెడీ డైరెక్టర్స్ తర్వాత అదే రేంజ్ క్రేజ్ మరియు బ్రాండ్ ఇమేజి ని సంపాదించుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల..ఈయన తీసిన సినిమాల్లో అధిక సాటాహం సూపర్ హిట్ సాధించిన సినిమాలే ఎక్కువే..వెంకీ , దుబాయి శ్రీను , ఢీ , దూకుడు ,రెడీ ఇలా ఒక్కటా రెండా ఎన్నో బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చిన ఘనత ఆయనది..సోషల్ ఇండియా లో ఇప్పటికి ఆయన సినిమాల్లోని సన్నివేశాలను మీమ్స్ గా వాడుకుంటూ ఉంటారు నెటిజెన్స్..అంతటి గొప్ప క్లాసిక్ సినిమాలను తీసాడు ఆయన..అందుకే ఆయనకీ ఇప్పటికి అంత క్రేజ్ ఉంటుంది..కానీ దూకుడు సినిమా తర్వాత పాపం మళ్ళీ ఆయనకీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ రావడం పక్కన పెడితే అన్ని డిజాస్టర్ సినిమాలే ఎదురయ్యాయి..ఒక బాద్షా సినిమా మినహా ఆయా తర్వాత వచ్చిన ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ మరియు అమర్ అక్బర్ ఆంటోని వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పల్టీలు కొట్టాయి.

Srinu Vaitla
ఆయన సినిమాలు అలా ఘోరంగా దెబ్బ తిని ఫేడ్ అవుట్ అయ్యిపోడానికి కారణం కోన వెంకట్ మరియు గోపి మోహన్ తో విభేదాలు ఏర్పడి విడిపోవడం వల్లే..మొదటి సినిమా నుండి బాద్షా వరుకు వీళ్ళ ముగ్గురు కలిసి పని చేసేవారు..అందుకే అంత మంచి ఔట్పుట్స్ వచ్చాయి..కానీ ఎప్పుడైతే వీళ్ళు శ్రీను వైట్ల నుండి దూరంగా వెళ్ళిపొయ్యారో..అప్పటి నుండి శ్రీను వైట్ల కెరీర్ కి ముగింపు పడింది..ఇప్పుడు మళ్ళీ ఆయన దర్శకత్వం వహించడానికి ముందుకి వచ్చారు..ప్రముఖ యాక్షన్ హీరో గోపీచంద్ తో ఆయన త్వరలోనే ఒక సినిమా చెయ్యబోతున్నట్టు సమాచారం.

Gopichand- Srinu Vaitla
ఇటీవలే గోపీచంద్ ని కలిసి కథ చెప్పాడట శ్రీను వైట్ల..ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి తానూ సిద్దమే అని..కానీ నీ పాత టీం మొత్తం మళ్ళీ కలిసి పని చేస్తాను అంటేనే ఈ సినిమా చేస్తానని..లేదంటే లేదని ముఖం మీదనే చెప్పేశాడట గోపిచంద్..దీనితో శ్రీను వైట్ల ఇటీవలే కోన వెంకట్ , గోపి మోహన్ ని కలిసి ఈ సినిమా కోసం పని చేద్దాం అని రిక్వెస్ట్ చెయ్యగా వెంటనే ఓకే చెప్పారట..కోన వెంకట్ ఈ సినిమాకి రచయితా గా వ్యవహరించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడట..గోపి చంద్ కి చాలా కాలం నుండి భారీ హిట్ లేదు..శ్రీను వైట్ల కెరీర్ పరిస్థితి కూడా అదే..మరో పక్క కోన వెంకట్ ,గోపి మోహన్ కెరీర్స్ కూడా అంతంత మాత్రమే ఉంది..వీళ్ళందరూ ఇప్పుడు కలిశారు కాబట్టి విజయం కోసం కచ్చితంగా కలిసి పనిచేస్తారని నమ్ముతున్నారు ఫాన్స్..చూడాలి మరి ఈ సినిమా తో గోపీచంద్ మరియు శ్రీను వైట్ల ఇద్దరు బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అనేది.
