Mahesh Babu- Pawan Kalyan: మహేష్-పవన్ ల కాంబోలో బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
నిజంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్, పవన్ కలిసి నటిస్తే…. బాక్సాఫీస్ బద్దలు అయ్యేది. ఓ ఊహే ఎంతో గొప్పగా ఉంది. ఎప్పటికైనా ఈ కాంబోలో మూవీ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.

Mahesh Babu- Pawan Kalyan: టాలీవుడ్ లో ముల్టీస్టారర్స్ చాలా తక్కువ. కొందరు హీరోలు చేస్తున్నారు. కానీ భారీ ఫ్యాన్ బేస్ కలిగిన ఇద్దరు హీరోలు చేయడం అరుదు. రాజమౌళి కారణంగా ఆర్ ఆర్ ఆర్ సాకారమైంది. నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ కలిసి నటించేందుకు ఒప్పుకున్నారు. ఇలా ఇద్దరు పెద్ద హీరోల కాంబోలో మూవీ వస్తే చూడాలని ఆశించే అభిమానులు ఉంటారు. అలాంటి క్రేజీ కాంబో పవన్ కళ్యాణ్-మహేష్ బాబు. చెప్పాలంటే తెలుగులో వీరిద్దరికీ ఉన్న ఫ్యాన్ బేస్ మరో హీరోకి లేదు.
మహేష్-పవన్ లతో మల్టీ స్టారర్ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. అది సాకారం కావాల్సింది. కానీ కుదరలేదని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకీ, మహేష్ కలిసి నటించారు. వెంకటేష్ పెద్దోడిగా, మహేష్ చిన్నోడిగా కనిపించారు. ఈ పెద్దోడి పాత్రకు ముందుగా పవన్ కళ్యాణ్ ని అనుకున్నాడట శ్రీకాంత్ అడ్డాల. అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ కారణంగా కుదర్లేదని ఆయన వివరణ ఇచ్చారు.
నిజంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్, పవన్ కలిసి నటిస్తే…. బాక్సాఫీస్ బద్దలు అయ్యేది. ఓ ఊహే ఎంతో గొప్పగా ఉంది. ఎప్పటికైనా ఈ కాంబోలో మూవీ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. భవిష్యత్ లో కుదిరితే మహేష్-పవన్ కళ్యాణ్ లతో మూవీ చేస్తానని శ్రీకాంత్ అడ్డాల అన్నారు. ఆయన మహేష్ తో రెండు చిత్రాలు చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్ కాగా బ్రహ్మోత్సవం నిరాశపరిచింది.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల పెదకాపు 1 చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సెప్టెంబర్ 29న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. నూతన హీరో విరాట్ కర్ణ నటిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. పెదకాపు చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెరిగాయి. అనసూయ కీలక రోల్ చేస్తుంది. శ్రీకాంత్ అడ్డాల నటుడిగా మారడం విశేషం. ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు.
ఇక టైటిల్ తోనే ఈ మూవీ పరిశ్రమలో చర్చకు దారి తీసింది. ఒక సామాజిక వర్గం పేరులా ఉన్న ఈ టైటిల్ పెట్టడం వెనుక కారణం ఏమిటో నిర్మాత రవీందర్ రెడ్డి వివరించారు. మొదట కర్ణ అని పెడదాం అనుకున్నాము. మూవీ లొకేషన్స్ వేటలో ఉండగా శ్రీకాంత్ అడ్డాల గారికి పెదకాపు అనే పేరు కనిపించింది. దాని గురించి స్థానికులను ఆరా తీస్తే… అది ఊరికి మంచి చేసిన ఓ వ్యక్తి పేరు అన్నారు. మన చిత్ర కథకు సెట్ అవుతుందని పెదకాపు టైటిల్ నిర్ణయించారని చెప్పుకొచ్చారు.
