Janhvi Kapoor: ఏం పాపం చేస్తే పుట్టావు అంటూ జాన్వీ కపూర్ పై విరుచుకుపడుతున్న శ్రీదేవి ఫ్యాన్స్

శ్రీదేవి బ్రతికి ఉన్న రోజుల్లో జాన్వీ కపూర్ చాలా పద్దతిగా ఉండేది, కానీ ఎప్పుడైతే ఆమె చనిపోయిందో అప్పటి నుండి జాన్వీ కపూర్ ని ఆపేవాళ్లే లేకుండా పోయారు. ఆమె ఇలా చేస్తున్నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ శ్రీదేవి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా జాన్వీ కపూర్ ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ మారుతుందో లేదో చూడాలి.

  • Written By: Vicky
  • Published On:
Janhvi Kapoor: ఏం పాపం చేస్తే పుట్టావు అంటూ జాన్వీ కపూర్ పై విరుచుకుపడుతున్న శ్రీదేవి ఫ్యాన్స్

Janhvi Kapoor: బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి చిన్నతనం లోనే ఎంతో మంచి గుర్తింపు దక్కించుకొని, ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు లో అప్పటి తరం స్టార్ హీరోలందరి సరసన నటించి నెంబర్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీదేవి. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ ఇలా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించి పాన్ ఇండియా లోనే నెంబర్ 1 హీరోయిన్ గా ఒకవెలుగు వెలిగింది.

అలాంటి మహానటి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఈమె మొదటి సినిమా విడుదల అయ్యేలోపే శ్రీదేవి దురదృష్టం కొద్దీ చనిపోవడం అప్పట్లో ఆమె అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది. అయితే ఆమెని జాన్వీ కపూర్ లో చూసుకొని సంతోషిద్దాం అని అనుకున్న అభిమానులకు జాన్వీ కపూర్ ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా ఇప్పటి వరకు సక్సెస్ లేకపోవడం దురదృష్టకరం.

దాంతో ఈమె అవకాశాల కోసం సోషల్ మీడియా లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ ఈమె అప్లోడ్ చేసే ఫోటోలకు సోషల్ మీడియా లో మామూలు క్రేజ్ ఉండదు. అది ప్రతీ హీరోయిన్ చేసేదే కాబట్టి అక్కడ ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, ఈమె వీకెండ్స్ వస్తే తన స్నేహితులతో పార్టీలకు , పబ్బులకు వెళ్లడం , అక్కడ ఇష్టమొచ్చినట్టు తాగేసి, పొగతాగుతూ ఎంజాయ్ చెయ్యడం వంటివి శ్రీదేవి అభిమానులకు చాలా చిరాకు కలిగిస్తున్న విషయం.

శ్రీదేవి బ్రతికి ఉన్న రోజుల్లో జాన్వీ కపూర్ చాలా పద్దతిగా ఉండేది, కానీ ఎప్పుడైతే ఆమె చనిపోయిందో అప్పటి నుండి జాన్వీ కపూర్ ని ఆపేవాళ్లే లేకుండా పోయారు. ఆమె ఇలా చేస్తున్నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ శ్రీదేవి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా జాన్వీ కపూర్ ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ మారుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు