Sridevi Birth Anniversary : శ్రీదేవి అలా చనిపోయింది.. మరణం వెనుక రహస్యాన్ని బయటపెట్టిన భర్త బోనీకపూర్
ఇలా ఆలోచిస్తే అతిలోక సుందరి మరణం చుట్టూ బోలెడు అనుమానాలు ఉన్నాయి. వాటికీ ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ బుక్ సమాధానాలు లభిస్తాయో లేదో చూడాలి. ఈ రోజు (ఆగస్టు 13) దేవకన్య శ్రీదేవి పుట్టినరోజు

Sridevi Birth Anniversary : శ్రీదేవి ఈ పేరు ఒక ప్రభంజనం. సౌత్ టు నార్త్ ఒక ఊపు ఊపేసింది ఈ అతిలోక సుందరి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఒక బుక్ రాస్తే అందులో ఒక పేజీ శ్రీదేవి సొంతం. అంతటి గొప్ప నటి దేశం కాని దేశంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం బాధాకరం. ఆమె జీవితంలో ఎన్నో దాగుడు మూతలు , ఎన్నో దాచలేని నిజాలు ఉన్నాయి. వాటినన్నిటిని ఒక పుస్తక రూపంలోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి బయోగ్రఫీని ప్రముఖ రచయిత, పరిశోధకుడు, బోనీ కపూర్ ఫ్రెండ్ ధీరజ్ కుమార్ రాస్తున్నారు. మరి ఇందులో శ్రీదేవికి సంబంధించిన అన్ని విషయాలు ఉంటాయా? కొన్నింటినే రాసి మిగతా వాటిని అలాగే వదిలేస్తారా? అతిలోక సుందరి మరణం వెనుక మిస్టరీ కూడా బయోగ్రఫీలో ఉంటుందా? ఇదే ఇప్పుడు శ్రీదేవి అభిమానులను తొలుస్తున్న ప్రశ్నలు.
ఎందుకంటే ఈ పుస్తకం రాస్తున్న వ్యక్తి బోని కపూర్ స్నేహితుడు. 2018 ఫిబ్రవరి 20 తేదీ ఇండియాకు రావాల్సిన శ్రీదేవి 24వ తేదీ వరకు దుబాయ్‌లోనే ఎందుకు ఉన్నారు? మిగిలిన అందరు స్వస్థలాలకు వెళ్లినా, చివరకు బోనీకపూర్ కూడా ముంబై వెళ్లినా కూడా ఆమె దుబాయ్‌లోనే ఎందుకున్నారు? ఇక దుబాయ్ పోలీసులు చెప్పినట్లు ఆమె మద్యం సేవించి ఉందని చెబుతున్నారు.
ఫోరెన్సిక్ నిపుణులు గుండె పోటుతో మరణించిందా? లేక నీళ్లలో పడి మరణించిందా? అనే విషయాన్నే చెప్పగలరు గానీ ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి మరణించిందని ఖచ్చితంగా ఎలా చెప్తారు? ఆమె 22 వ తేదీ నుంచి మరణించిన 24వ తేదీ వరకు శ్రీదేవి అసలు హోటల్ రూం నుంచి ఎందుకు బయటకు రాలేదు? పైగా ఇండియా లో ఉన్న బోనీ కపూర్ సర్ ప్రైజ్ ఇవ్వడానికి దుబాయ్ వెళ్లిన తర్వాత ఆమె చనిపోయినట్లు తెలుసుకున్నాడు. ఇలా ఆలోచిస్తే అతిలోక సుందరి మరణం చుట్టూ బోలెడు అనుమానాలు ఉన్నాయి. వాటికీ ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ బుక్ సమాధానాలు లభిస్తాయో లేదో చూడాలి. ఈ రోజు (ఆగస్టు 13) దేవకన్య శ్రీదేవి పుట్టినరోజు
