BS Rao : బిగ్ బ్రేకింగ్: శ్రీ చైతన్య విద్యాసంస్థల అధిపతి బిఎస్ రావు కన్నుమూత

బంధువులు ఇచ్చిన సూచనల ప్రకారం 1986లో శ్రీ చైతన్య విద్యా సంస్థలను బొప్పన సత్యనారాయణ రావు ప్రారంభించారు. మొదటిసారిగా విజయవాడలో బాలికల జూనియర్ కాలేజీ స్థాపించారు. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు అంచెలంచలుగా తన విద్యా సంస్థలను విస్తరించారు.

  • Written By: Bhaskar
  • Published On:
BS Rao : బిగ్ బ్రేకింగ్: శ్రీ చైతన్య విద్యాసంస్థల అధిపతి బిఎస్ రావు కన్నుమూత

BS Rao : శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బిఎస్ రావు అలియాస్ బొప్పన సత్యనారాయణ రావు (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని తన నివాసంలోనే ఉంటున్నారు. అయితే గురువారం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు విజయవాడకు తరలించారు.

బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణ రావు. ఈయన వైద్య విద్య అభ్యసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి శ్రీ చైతన్య విద్యాసంస్థలను ప్రారంభించక ముందు ఇరాన్, ఇంగ్లాండ్ దేశాలలో వైద్యుడిగా సేవలు అందించారు. ఆ రోజుల్లోనే ఆ దేశాల్లో ప్రముఖమైన వైద్యుడిగా పేరుపొందారు. వైద్యుడిగా అత్యున్నత సేవలు అందించి భారీగా డబ్బు సంపాదించారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత తన సొంత ప్రాంతం విజయవాడలో కొద్దిరోజులపాటు క్లినిక్ నడిపారు. తర్వాత బంధువుల సూచనతో విద్యాలయాల ఏర్పాటుకు నడుంబించారు. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రాక్టీస్ మానేశారు.

1986లో శ్రీచైతన్య విద్యాసంస్థల స్థాపన

బంధువులు ఇచ్చిన సూచనల ప్రకారం 1986లో శ్రీ చైతన్య విద్యా సంస్థలను బొప్పన సత్యనారాయణ రావు ప్రారంభించారు. మొదటిసారిగా విజయవాడలో బాలికల జూనియర్ కాలేజీ స్థాపించారు. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు అంచెలంచలుగా తన విద్యా సంస్థలను విస్తరించారు. 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూల్స్, 107 సీబీఎస్ఈ స్కూల్స్ స్థాపించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో దాదాపు 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి వేలాదిమంది ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. కాగా బీఎస్ రావు అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించనున్నారు.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు