Sreedevi Drama Company: బుల్లి తెరలో ఎన్ని షోలు ఉన్నా.. ప్రేక్షకులు వినోదమైన కార్యక్రమాలకే మొగ్గు చూపుతారు. అలా ప్రేక్షకుల పల్స్ ని క్యాచ్ చేసుకుని బోలెడు ఎంటర్టైన్మెంట్ షోలు, రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. ఇంకా చెప్పాల్సిన పని లేదు.. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కాబట్టే టీవీ చానల్స్ అన్ని ఎంటర్టైన్మెంట్ షో లతో కాలం వెలిబుచ్చుతున్నాయి . అంతే కాకుండా బుల్లితెరకి ఎంటర్టైన్మెంట్ షోల తోనే ఎక్కువ రేటింగ్ వస్తుంది.
ఈటీవీ షోలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు మంచి రేటింగ్ తో దూసుకుపోతూ మంచి ఎంటర్టైన్మెంట్ షో గా మారింది. ఇందులో బుల్లితెర పై ఒక వెలుగొందుతున్న స్టార్ సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ కార్యక్రమానికి సినీ నటి ఇంద్రజ జడ్జి గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రతి వారం వారం బుల్లితెర,వెండి తెర సెలెబ్రిటీలను పిలిచి సందడి చేస్తున్నారు. అంతే కాకుండా రేటింగ్ పరంగా కూడా ఓ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది.
అయితే ప్రతి వారం ఏదొక కాన్సెప్ట్ తీసుకుని ప్రేక్షకులని అలరింప చేస్తారు శ్రీ దేవి డ్రామా కంపెనీ బృందం. కార్తీక మాసం సందర్భం గా వనభోజనాలు అనే కాన్సెప్ట్ తో వచ్చే ఆదివారానికి సంబందించిన ప్రోమో ని విడుదల చేశారు. ఆ ప్రోమో లో టీవీ షో లు వర్సెస్ సీరియల్స్ అనే థీమ్ ని తీసుకుని ఒకవైపు సీరియల్ ఆర్టిస్టులని మరోవైపు షో లకి సంబంధించిన సెలబ్రిటీస్ పిలిచారు.
ముఖ్య అతిధి గా సితార: ప్రతి వారం వారం ఏదొక సెలబ్రిటీ వస్తారనే సంగతి తెల్సిందే. అలా ఈ వారానికి గాను వెండితెర సెలబ్రిటీ సితార శ్రీదేవి డ్రామా కంపెనీ కి వచ్చి చాలా ఆకర్షణగా నిలిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించడమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి ఎంతో మంది అభిమానుల్ని సంపాందించుకున్నారు సితార.
టీవీ షో లు వర్సెస్ సీరియల్స్ అనే థీమ్ లో భాగం గా బిగ్ బాస్ సెలబ్రిటీస్ లాస్య, అరియనా, శివ జ్యోతి, జబర్దస్త్ వర్ష, అలా మిగతా సెలబ్రిటీస్ కూడా వచ్చి స్కిట్లు, డాన్స్ పర్ఫార్మెన్సు లతో అలరించినట్టు చూపించారు. మరోవైపు టీవీ ఆర్టిస్టులు చక్రవాకం, మొగలిరేకులు ఫేమ్ శృతి, సుహాసిని అలా పరువురు ఆర్టిస్ట్ లు కూడా తమదైన స్టయిల్లో ఎంటర్టైన్ చేసినట్టు చూపించారు ప్రోమోలో. ప్రోమో చూస్తూనే చాలా కలర్ ఫుల్ గా ఉంది… మొత్తం ఎపిసోడ్ చూస్తే ఎంత వినోదం గా ఉంటుందో అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ కలర్ ఫుల్ ఎపిసోడ్ కోసం వచ్చే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.