Chicken Prices: శ్రావణమొచ్చింది.. చికెన్ ప్రియులకు పండుగ తెచ్చింది!
మొన్నటి వరకు ట్రిపుల్ సెంచరీ దాటిన చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. శ్రావణ మాసంలో చాలా మంది మాంసాహారాన్ని ముట్టకపోవడం, అధిక ధరల కారణంగా వినియోగదారులు చికెన్ కొనుగోలు చేసేందుకు వెనకంజ వేయడంతో డిమాండ్ లేక మరోసారి చికెన్ రేటు తగ్గుముఖం పట్టింది. దాదాపు రెండు నెలలు కిలోకు రూ.300 నుంచి రూ.340 వరకు పలుకగా, గడిచిన వారం రోజుల్లో ఏకంగా రూ.100 మేర తగ్గింది.

Chicken Prices: దాదాపు రెండు నెలలుగా కొండెక్కిన కోడి మాంసం ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి. ఒక దశలో కిలో చికెన్ ధర రూ.350కి చేరింది. కోడితోపాటు గుడ్డు కూడా ఆకాశంవైపే చూసింది. దీంతో నీసు తినడానికే భయపడ్డారు పేద, మధ్య తరగతి ప్రజలు. కానీ ఇప్పుడు నేల చూపు చూస్తున్నాయి. వేగంగా ధరలు దిగివస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా పడిపోతున్నాయి.
శ్రావణం ఎఫెక్ట్..
మొన్నటి వరకు ట్రిపుల్ సెంచరీ దాటిన చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. శ్రావణ మాసంలో చాలా మంది మాంసాహారాన్ని ముట్టకపోవడం, అధిక ధరల కారణంగా వినియోగదారులు చికెన్ కొనుగోలు చేసేందుకు వెనకంజ వేయడంతో డిమాండ్ లేక మరోసారి చికెన్ రేటు తగ్గుముఖం పట్టింది. దాదాపు రెండు నెలలు కిలోకు రూ.300 నుంచి రూ.340 వరకు పలుకగా, గడిచిన వారం రోజుల్లో ఏకంగా రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో లైవ్ బర్డ్ రూ.130, కిలో స్కిన్‌తో రూ.200, స్కిన్ లెస్ రూ.230 పలుకుతోంది. మరో రెండు, మూడు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని చికెన్ సెంటర్ల యజమానులు అంటున్నారు.
అధిక శ్రావణం..
అయితే ఈఏడాది అధిక శ్రావణం వచ్చింది. ఈనెల 18 నుంచి ఆగస్టు 17 వరకు అధిక శ్రావణమే. ఈమాసంలో ఎలాంటి ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఆగస్టు 18 నుంచి నిజ శ్రావణం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో వినాయక చవితి కూడా ఉంది. దీంతో అధిక శ్రావణంలో మాసం లాగించే అవకాశం ఉంది. అంటే ఆగస్టు 17 వరకు మాంసం, చికన్ ప్రియులు ఇక పండుగ చేసుకుంటారని అంచనా. తగ్గుతున్న ధరలు చికెన్ ప్రియుల నోరూరిస్తున్నాయి. ఆగస్టు 17 తర్వాత మాంసం కొనుగోళ్లు భారీగా తగ్గుతాయని కొంతమంది పేర్కొంటున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యే వరకూ మాసం కొనుగోళ్లు తగ్గుతాయని అంటున్నారు.
