spot_img
Homeక్రీడలుFootball vs Cricket Popularity: ఫుట్ బాల్ రేంజ్ క్రికెట్ అందుకోలేదా.. ఎందుకు..

Football vs Cricket Popularity: ఫుట్ బాల్ రేంజ్ క్రికెట్ అందుకోలేదా.. ఎందుకు..

Football vs Cricket Popularity: మనదేశంలో క్రికెట్ ను చాలా మంది చూస్తుంటారు. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం వంటి రాష్ట్రాలలో ఫుట్ బాల్ కూడా చూస్తుంటారు. మనదేశంలో చాలామంది ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ లు చాలామంది ఉన్నారు. చత్రి లాంటివాళ్ళు ఇండియన్ ఫుట్ బాల్ కు సరికొత్త గుర్తింపును తీసుకొచ్చారు.

100 కోట్లకు పైగా జనాభా ఉన్న మనదేశంలో క్రికెట్ చాలామంది చూడటం వల్ల విశేషమైన క్రీడగా పేరు తెచ్చుకుంది. ఐపీఎల్ లాంటి లీగ్ లక్ష కోట్లకు పైచిలుకు బ్రాండ్ వ్యాల్యూ ను సొంతం చేసిందంటే దానికి భారతీయుల అభిమానమే కారణం. ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న నేపథ్యంలో క్రికెట్ ఫుట్ బాల్ రేంజ్ కు ఎదుగుతుందని అందరు అనుకున్నారు. కానీ వారందరి అంచనాలు తప్పు.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఫుట్ బాల్ ఫీవర్ తో ఊగిపోతోంది. మెక్సికో వేదికగా 2026 ఫిఫా ప్రపంచకప్ మొదలైంది. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై మెక్సికో విజయం సాధించింది. ఈసారి అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తంగా 48 జట్లు పోటీలో ఉంటున్నాయి. 16 మైదానాలలో 39 రోజులపాటు 104 మ్యాచులు నిర్వహించబోతున్నారు. ఫిఫా చరిత్రలో ఇదే అతి పెద్ద టోర్నీగా రికార్డులోకి ఎక్కింది.

1998 తర్వాత తొలిసారిగా జట్ల సంఖ్యను ఫిఫా పెంచింది.. ఈసారి బహుమతిని కూడా పెంచేసింది. 655 మిలియన్ డాలర్లను పంపిణీ చేస్తోంది. ఇది మన దేశ కరెన్సీ ప్రకారం చెప్పుకుంటే 6,250 కోట్లు. గడచిన ఫిఫా ప్రపంచకప్ పోల్చి చూస్తే ఇది 50% ఎక్కువ.

ఫిఫా లో విజేతగా నిలిచే జట్టుకు 476 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది.. రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 314 కోట్లు లభిస్తాయి. మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు 276 కోట్లు లభిస్తాయి. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు 257 కోట్లు లభిస్తాయి.

క్వార్టర్ ఫైనల్ దాకా వచ్చిన జట్టుకు 181 కోట్లు లభిస్తాయి.. ప్రీ క్వార్టర్ దాకా వచ్చిన జట్టుకు 142 కోట్లు లభిస్తాయి. గ్రూపు దశలో ఆడే జట్లకు 85 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. అంతేకాదు ప్రపంచ కప్ కోసం అర్హత సాధించిన జట్టుకు సన్నాహక ఖర్చులకోసం 1.5 మిలియన్ డాలర్లు ఇస్తారు. ఈసారి ఫిఫా ఖర్చు కోసం 727 మిలియన్ డాలర్లను కౌన్సిల్ ఆమోదించింది.

ఇటీవల icc t20 ప్రపంచ కప్ నిర్వహించింది. మొత్తంగా 107 కోట్లను ప్రైజ్ మనీ ఖర్చు చేసింది. భారత జట్టు విజేతగా నిలవడంతో.. 25 కోట్లు లభించాయి. రెండవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టుకు 13.53 కోట్లు లభించాయి. మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు 1 మిలియన్ డాలర్లు లభించాయి. ఫిఫా ప్రపంచ కప్ లో విజేతగా నిలిచే జట్టుకు.. టి20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన జట్టు కంటే దాదాపు 19రెట్ల నగదు బహుమతి ఎక్కువగా అందుకుంటుంది.

ఫిఫా కప్ లో చివరి స్థానంలో నిలిచే జట్టుకు.. దాదాపు 100 కోట్ల వరకు లభిస్తాయి. ఫిఫా కప్పులో చివరి స్థానంలో నిలిచే జట్టుకు.. టీ20 వరల్డ్ కప్ లో అన్ని జట్లకు లభించే ప్రైజ్ మనీ దాదాపు సమానం.. ఫుట్ బాల్ కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంటుంది. ప్రసార హక్కులు కూడా వేల కోట్లకు అమ్ముడుపోతుంటాయి. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఫుట్ బాల్ ఆట విస్తరించి ఉంటుంది. అందువల్లే నగదు బహుమతి ఎక్కువగా ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version