Virat Kohli : ఎక్కడున్నా మన మూలాలు మరిచిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మరువకూడదు. కోహ్లీ అంత పెద్ద క్రికెటర్ అయినా.. ఈరోజు మ్యాచ్ లో ఆడకపోయినా.. తన తోటి క్రికెటర్లకు వాటర్ బాయ్ లా మారి నీళ్లు సరఫరా చేసిన విధానం చూసి అందరూ ఫిదా అయ్యారు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత సరదాగా ఉంటాడో తెలిసిందే. మైదానంలో ఉన్నా, డగౌట్‌లో కూర్చున్నా.. తన తెలివితేటలతో తోటి ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తాడు. ఏ పనిలో అయినా ఒదిగిపోతాడు.. కొన్నిసార్లు అతను తన హావభావాలతో ప్రజలను నవ్విస్తాడు. ఇటీవల, ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్ (IND vs BAN)లో కోహ్లీకి విశ్రాంతి లభించింది. దీంతో ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ తన జట్టు ఆటగాళ్లకు ‘వాటర్ బాయ్’గా మారాడు.
బంగ్లాదేశ్ ఆటగాడు అనాముల్ హక్ ఔటైన తర్వాత, కోహ్లి మైదానంలో తన సహచరులకు వాటర్ బాటిళ్లను తీసుకెళ్లాడు. ఆ సమయంలో అతను పరిగెత్తిన తీరు చాలా ఫన్నీగా ఉంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విరాట్ కామెడీ టైమింగ్‌ను అభినందిస్తున్నారు.
తాజా మ్యాచ్‌లో టీమిండియాకు శుభారంభం లభించింది. అయితే లోయర్ ఆర్డర్ రాణించడంతో బంగ్లాదేశ్ 265-8 భారీ స్కోరు సాధించింది.
మరోవైపు ఆసియాకప్‌లో ఇప్పటికే ఫైనల్‌కు చేరిన టీమిండియా.. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో పలు మార్పులు చేసింది. కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా, సిరాజ్, బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చారు.
— RVCJ Media (@RVCJ_FB) September 15, 2023