Varun Chakraborty : యుక్త వయసులో ఉన్నప్పుడే క్రికెటర్లు టీమ్ ఇండియాలోకి వస్తారు. తమ ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. 32 -33 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటారు. అప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకుంటారు. కానీ ఈ ఆటగాడు పూర్తి విభిన్నం. 32 సంవత్సరాలకు టీమిండియాలోకి వచ్చాడు. ఇప్పుడు అతడి వయసు 33 సంవత్సరాలు. వన్డేల్లో ఆడుతున్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో కీలకమైన బౌలర్ గా మారబోతున్నాడు. గొప్ప గొప్ప బౌలర్లు ఉన్నప్పటికీ టీమిండియా అతడిపై ప్రధానంగా దృష్టి సారించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
వరుణ్ చక్రవర్తి (Varun Chakravarti) న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అబుదాబి మైదానంలో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మ్యాజికల్ బంతులు వేస్తూ అదరగొట్టాడు. లో స్కోర్ మ్యాచ్ లో టీమ్ ఇండియా గెలిచేలా చేసాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో తన బెర్త్ ఖరారు చేసుకున్నాడు. 2018 లోనే వరుణ్ చక్రవర్తి దేశవాళి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అప్పటికి అతడి వయసు 26 సంవత్సరాలు. 2019లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ జట్టు తరఫున ఆడాడు.. ఇక 2020 సీజన్లో కోల్ కతా జట్టులోకి ప్రవేశించాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ మిస్టరీస్ స్పిన్ బౌలర్ సునీల్ నరైన్ మెలకువలు నేర్పడంతో వరుణ్ తన ప్రతిభకు మరింత పదును పెట్టుకున్నాడు. ఇక ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20, వన్డే సిరీస్ లో వరుణ్ ఆకట్టుకున్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ లోనూ అదర గొట్టాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 5 వికెట్లతో వారెవ్వా అనిపించాడు.
Also Read : టీమిండియా జెర్సీపై పాకిస్తాన్ పేరే ఉండదు.. చాంపియన్స్ ట్రోఫీలో దాయాదికి షాక్ ఇచ్చిన భారత్.. ఏం చేసిందంటే?
అదే అతని నైపుణ్యం
వరుణ్ మిస్టరీ స్పిన్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. బంతిని వేసే విధానం విచిత్రంగా ఉంటుంది. బ్యాటర్ పసిగట్టే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దూసుకు వచ్చే ఆ బంతిని ఆడటం పెద్ద పెద్ద బ్యాటర్లకు కూడా సాధ్యం కాదు.. గత ఏడాది ఐపిఎల్ లో కోల్ కతా జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించడంలో వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. అయితే 32 సంవత్సరాల వయసులో టీమిండియాలోకి వచ్చినప్పటికీ.. అతడు పూర్తిస్థాయిలో సభ్యుడు కాబోతున్నాడు.. ఇక మంగళవారం జరిగే సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్లేయర్లకు వరుణ్ చక్రవర్తి చుక్కలు చూపించడం కాయంగా కనిపిస్తోంది.. వాస్తవానికి వరుణ్ చక్రవర్తికి క్రికెటర్ కావడం ఇష్టం లేదట. మొదట్లో ఆర్కిటెక్టర్ లేదా సినిమా డైరెక్టర్ కావాలని అనుకునేవారట. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతంలో పుట్టిన వరుణ్ చక్రవర్తి దేశవాళి క్రికెట్లో తమిళనాడు జట్టుకు ఆడేవాడు. ఇక ఇప్పటివరకు 18 t20 లు, రెండు వన్డే మ్యాచ్లను వరుణ్ ఆడాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి అత్యంత కీలకం కానున్నాడు. న్యూజిలాండ్ జట్టుపై మాదిరిగానే ఆస్ట్రేలియా పై కూడా బౌలింగ్ చేస్తే టీమిండియా కు తిరుగు ఉండదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : భారత జట్టు పగ్గాలు మళ్లీ అతడికే.. సంకేతాలు ఇచ్చిన బీసీసీఐ!