Site icon OkTelugu

Vaibhav Suryavanshi Family: వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో డైనమైట్.. తట్టుకోవడం కష్టమే

Vaibhav Suryavanshi Family

Vaibhav Suryavanshi Family

Vaibhav Suryavanshi Family: వైభవ్ సూర్య వంశీ జాతీయ జట్టుకు ఎంపిక అయ్యాడు. కానీ ఇంతవరకు జట్టులోకి అడుగుపెట్టలేదు. ఐర్లాండ్ సిరీస్ ద్వారా అతడు టీమిండియాలోకి ప్రవేశించాలి. కానీ ఐర్లాండ్లో జరుగుతున్న నిరసనల వల్ల అతడు జాతీయ జట్టులోకి ఆగమనం చేసే వ్యవహారం ఇంకా కాస్త ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. జాతీయ జట్టులో అడుగుపెట్టే విషయంలో ఆలస్యమైనప్పటికీ సూర్య వంశీ ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఖాయం.

సూర్య వంశీ తను ఏంటో అండర్ 19 క్రికెట్లో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ లో కూడా అదరగొట్టాడు.. గొప్ప గొప్ప బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని పడుకోబెట్టాడు. సునామిస్థాయిలో పరుగులు సాధించి సంచలనం కలిగించాడు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకుని తిరుగులేని రికార్డును తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. సూర్య వంశీ ప్రస్తుత క్రికెట్లో సంచలనం అనుకుంటే.. అతని కుటుంబం నుంచి మరొక వ్యక్తి క్రికెట్లోకి వచ్చేసాడు. పదిహేను సంవత్సరాల వయసులోనే సూర్య వంశీ రికార్డులు బద్దలు కొడుతుంటే.. అతడు వచ్చి రాగానే వీరలెవల్లో బ్యాటింగ్ చేశాడు. సూర్యవంశీ ని మించి తనలో టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు.

సూర్యవంశీ కుటుంబం నుంచి వచ్చిన మరొక ఆటగాడు మరెవరో కాదు, అతడి తమ్ముడు ఆశీర్వాద్ సూర్య వంశీ. ఇతడికి 10 సంవత్సరాల వయసు ఉంటుంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు. ఇతడు లోకల్ ప్రాక్టీస్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. తాజ్ పూర్ క్రికెట్ అకాడమీ తరఫున ఏకంగా 87 బంతుల్లో ఒక సిక్సర్.. 20 ఫోర్ల సహాయంతో 103 పరుగులు సాధించాడు. సూర్య వంశీ మాదిరిగా కాకుండా.. సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. తద్వారా సెంచరీ కొట్టేశాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆశీర్వాద్ మాట్లాడాడు. అన్న మాదిరిగానే తనకు క్రికెట్ అంటే ఇష్టమని.. క్రికెటర్ కావాలనుకున్నట్టు వెల్లడించాడు. దానికి తగ్గట్టుగానే ఆశీర్వాద్ సంచలనాలు సృష్టించడం మొదలుపెట్టాడు.. 10 సంవత్సరాల వయసులోనే ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తే.. ఇక వచ్చే రోజుల్లో అంతకుమించి అనే రేంజ్ లో అతడు పరుగులు సాధించే అవకాశం ఉంది.

సూర్య వంశీ మాదిరిగానే ఆశీర్వాద్ కూడా బలంగా కనిపిస్తున్నాడు. ఇతడికి కూడా క్రికెట్ మీద విపరీతమైన మక్కువ ఉన్నట్టుంది.. అందువల్లే ఈ స్థాయిలో పరుగులు చేస్తున్నారు. బంతిని చూడగానే బలంగా కొడుతున్నాడు. వికెట్ల మధ్య చిరుత పులి మాదిరిగా పరుగులు పెడుతున్నాడు. అలుపు సొలుపు అనేది లేకుండా ఆడుతున్నాడు. ఇతడికి సరైన ట్రైనింగ్ ఇస్తే వైభవ్ సూర్య వంశీని కచ్చితంగా మించిపోతాడు.

Exit mobile version