IPL 2024: ట్రేడింగ్ పద్దతి లో హైదరాబాద్ టీమ్ లోకి రాబోతున్న ఆ స్టార్ ప్లేయర్…

ముంబై ఇండియన్స్ టీమ్ కి చెందిన కేమరాన్ గ్రీన్ ని ట్రేడింగ్ విధానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తీసుకుంది. ఇక ఇప్పుడు అదే బాటలో మరొక ప్లేయర్ కూడా మరో టీమ్ ని చేరబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి ఆయన ఎవరు అంటే సౌత్ ఆఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్.

Written By: Gopi, Updated On : December 5, 2023 9:17 am

IPL 2024

Follow us on

IPL 2024: ఐపీఎల్ 2024 కోసం ప్రతి జట్టు సిద్దం అవుతుంది. ఇక ఇప్పటి నుంచే ఆయా టీమ్ లలో ఏ ప్లేయర్లు ఉండాలి, కోచ్ లు గా ఎవరిని నియమించాలి అనేదాని మీదనే చాలా రకాలైన చర్చలు జరుగుతున్నాయి… తమ టీం లో నుంచి ఆటగాళ్లను తీసివేసి కొత్త ఆటగాళ్ల ను రిప్లేస్ చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక అందులో భాగంగానే ఈనెల 19 వ తేదీన దుబాయ్ వేదికగా మినీ ఆక్షన్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఆక్షన్ లోకి 1100 మంది పైచిలుకు ప్లేయర్స్ అందుబాటులో ఉండనున్నారు. ఇక వీళ్ళలో కొంతమందిని మాత్రమే ఆయా టీమ్ లు తీసుకో బోతున్నాయి. ఇక ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ టీమ్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్య ను ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ టీమ్ తీసుకుంది.

అలాగే ముంబై ఇండియన్స్ టీమ్ కి చెందిన కేమరాన్ గ్రీన్ ని ట్రేడింగ్ విధానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తీసుకుంది. ఇక ఇప్పుడు అదే బాటలో మరొక ప్లేయర్ కూడా మరో టీమ్ ని చేరబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి ఆయన ఎవరు అంటే సౌత్ ఆఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్… ఈయన గత రెండు సిజన్ల నుంచి లక్నో టీం కి ఆడుతున్నాడు అయినప్పటికీ ఆయనని ట్రేడింగ్ విధానంలో ప్రస్తుతం హైదరాబాద్ టీం తీసుకొబోతున్నట్టుగా వార్తలయితే వస్తున్నాయి. నిజానికి డికాక్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు వన్నె వరల్డ్ కప్ లో నాలుగు సెంచరీలు చేసి తనదైన రీతిలో క్రికెట్ అభిమానులందరిని ఆకట్టుకున్నాడు.

ఇక ఇప్పుడు హైదరాబాద్ టీం లోకి డికాక్ కనక వస్తే హైదరాబాద్ టీం చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. గత కొద్ది సీజన్ల నుంచి హైదరాబాద్ టీమ్ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతూ వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ టీమ్ కి సరైన కెప్టెన్ లేకపోవడం వల్లే ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ టీం దశ మారాలి అంటే మాత్రం కొంతమంది స్టార్ హిట్టర్ లను ఆ టీంలోకి తీసుకోవాలి అందులో ముఖ్యంగా ఓపెనర్ అయిన డికాక్ ని తీసుకుంటే కొంతవరకు బెటర్ అవుతుంది…

ఇక ఇది ఇలా ఉంటే హైదరాబాద్ టీం ఇప్పటికే చాలామంది ప్లేయర్లను రిలీజ్ చేసింది. అందులో భాగంగా కొంతమంది కొత్త ప్లేయర్ల మీద ఈ టీం కన్నేసినట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్ లాంటి స్టార్ ప్లేయర్లని టీం లోకి తీసుకోవాలనే ఆలోచనలు అయితే ఉంది…