Ramiz Raja: వరల్డ్ కప్ ఇక సర్వం సిద్ధం అయింది మ్యాచ్ లు జరగడమే ఆలస్యం అనే రేంజ్ లో ప్రతి టీం కూడా వరల్డ్ కప్ పోరు కి సిద్ధం అయ్యాయి. అయితే ప్లేయర్లు ఎలాగైతే ఆడటానికి సిద్ధం గా ఉంటున్నారో అలాగే కామెంటేటర్లు కూడా వాళ్ళ కామెంట్రీ తో జనాలకి ఉత్సాహాన్ని నింపడానికి రెడీ అయిపోయారు.అక్టోబర్ 5 వ తేదీ నుండి జరగనున్న ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లు దాదాపు 45 రోజుల పాటు సాగనున్నాయి.ఇక 10 వేదికల్లో మ్యాచులు జరగనుండగ దానికోసం ఇబ్బంది లేకుండా 31 మంది తో కూడిన కామెంటేటర్ల జాబితాని ఐసీసీ వెల్లడించడం జరిగింది.అయితే ఈ కామెంటేటర్ల జాబితాలో ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక,జింబాబే దేశాలకి చెందిన మాజీ ప్లేయర్లని కామెంటేటర్లు గా తీసుకోవడం జరిగింది… అయితే ఏ దేశం నుంచి ఎంతమంది కామెంటేటర్లు ఉన్నారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ఇండియా లో కామెంటేటర్లు గా బాగా ఫెమస్ అయిన వాళ్లలో సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, హర్ష భోగ్లే లాంటి వారు ఈ వరల్డ్ కప్ లో కూడా వాళ్ళ గాత్రం తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుందన్నారు. ఇక వీళ్ల తో పాటు ఇండియా నుంచి కొత్తాగా దినేష్ కార్తీక్ ,అజయ్ చోప్రా లు కూడా ఆడ్ అవుతున్నారు…ఇక దినేష్ కార్తీక్ ఇంతకు ముందు కూడా ఇండియా ఆడిన కొన్ని మ్యాచ్ లకి కామెంటేటర్ గా చేసినప్పటికీ వరల్డ్ కప్ లో కామెంటేటర్ గా చేయడం ఇదే మొదటి సారి…
ఇక ఆస్ట్రేలియన్ కామెంటేటర్లు గా రికి పాంటింగ్,మత్యు హేడన్,షేన్ వాట్సన్,లిసా స్ధాలేకర్,ఆరోన్ ఫించ్, మార్క్ నికోలస్, డిర్క్ నన్నెస్, మార్క్ హోవార్డ్ లు ఈ వరల్డ్ కప్ కోసం కామెంటేటర్లు గా వ్యవహరిస్తున్నారు…
ఇక ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్లలో ఇయాన్ మోర్గాన్,అలాగే నజీర్ హుసన్,మైకేల్ అథేర్టోన్,ఇయాన్ వార్డ్ లాంటి వారు ఈసారి కామెంటేటర్లు గా వ్యవహరిస్తున్నారు…ఇక 2019 లో ఇంగ్లాండ్ కి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ అయిన ఇయాన్ మోర్గాన్ కూడా ఈసారి వరల్డ్ కప్ కోసం కామెంటెర్ గా అవతారమెత్తాడు.ఇక ఇంగ్లాండ్ కి వరల్డ్ కప్ వచ్చాక ఆయన అన్ని ఫార్మాట్లకి రిటైర్ మెంట్ ప్రకటించడం జరిగింది.దాంతో ఇప్పడు ఇలా క్రికెట్ అభిమానులను ఖుషి చేయడానికి మన ముందుకు వస్తున్నారు…
ఇక న్యూజిలాండ్ నుంచి ఇయాన్ స్మిత్, సైమన్ డ్యూయల్, కాటే మార్టిన్ లు కామెంటేటర్లు గా వ్యవహరిస్తున్నారు…
ఇక సౌత్ ఆఫ్రికా నుంచి షాన్ పొలాక్, కేస్ నైడూ, నటాలీ జెర్మనోస్…
ఇక వెస్టిండీస్ నుంచి ఇయాన్ బిషప్, శ్యామ్యూల్ బద్రి…
ఇక పాకిస్థాన్ నుంచి కూడా రమిన్ రాజా, వాకర్ యూనిస్ లాంటి వాళ్ళు కామెంటేటర్లు గా ఉన్నారు…
ఇక బాంగ్లాదేశ్ నుంచి అథర్ అలీఖాన్, జింబాబే నుంచి పామియో బంగ్వా, శ్రీలంక నుంచి రస్సెల్ ఆర్నాల్డ్ లతో కూడిన వాళ్ళని ఐసీసీ కామెంటేటర్లు గా తీసుకోవడం జరిగింది…
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రం ఒక్క విషయం లో చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.అది ఏంటి అంటే కొద్దిరోజుల కిందట రమిన్ రాజా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ గా ఉన్నప్పుడు ఇండియా మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.అవేంటంటే బిసిసిఐ ఏషియా కప్ ఆడటానికి ఇండియా పాకిస్థాన్ వెళ్లే ప్రసక్తే లేదు అని అన్నప్పుడు రమిన్ రాజా జోక్యం చేసుకొని ఏషియా కప్ ఆడటానికి ఇండియా పాకిస్థాన్ రాకపోతే ప్రపంచ కప్ ఆడటానికి పాకిస్థాన్ ఇండియా కి రాదు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు దాంతో అప్పటి నుంచి ఆయన మీద ఇండియన్ క్రికెట్ అభిమానులు చాలా కోపం తో ఉన్నారు. కానీ ఇప్పడూ కామెంటేటర్ల లిస్ట్ లో ఐసీసీ ఆయన పేరు ని ప్రకటించడంతో మరోసారి ఇండియన్ అభిమానులు అందరు కూడా అసహనాన్ని వ్యక్తం చేయడం జరుగతుంది…