NZ vs SA : వయసు, లింగ బేధంతో సంబంధం లేకుండా గత ఏడు ఐసీసీ టోర్నమెంట్లలో నాకౌట్ దశకు వెళ్లిన ఏకైక క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా. కానీ దురదృష్టం కొద్దీ ఆ జట్టు ఇంతవరకు ఐసీసీ ట్రోఫీ అందుకోలేదు. 2024లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ పోరులో భారత్ చేతిలో భంగపాటుకు గురయింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో సెమి ఫైనల్లో బుధవారం న్యూజిలాండ్ జట్టుతో తలపడునుంది.
Also Read :సౌతాఫ్రికాకు ఎంత కష్టమొచ్చే.. పాకిస్తాన్ లో ఆఖరుకు కోచ్ వచ్చి ఫీల్డింగ్ చేయబట్టే
దక్షిణాఫ్రికా జట్టు 1998లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని (అప్పట్లో దీనిని ఐసిసి నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవారు) గెలిచింది. 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఈ ఫార్మాట్లో మూడుసార్లు మాత్రమే పోటీపడ్డాయి. ఇక ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా జట్టు వరుస విజయాలు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లను ఓడించింది. ఆస్ట్రేలియాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. జట్టులో ఆటగాళ్లు మొత్తం సూపర్ ఫామ్ లో ఉన్నారు. కీలక దశలో మెరుపులు మెరిపిస్తున్నారు.
ఇక న్యూజిలాండ్ జట్టు విషయానికొస్తే.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లపై విజయం సాధించి.. భారత్ చేతిలో 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.. అది ఆ జట్టుకు ఒకరకంగా షాక్. ఇక ఇటీవల జరిగిన ట్రై సిరీస్లో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్లను మట్టికరిపించి న్యూజిలాండ్ సిరీస్ సొంతం చేసుకుంది. ఈ ట్రై సిరీస్ లో దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో మరో 8 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక ప్రస్తుత టోర్నమెంట్లో 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆరు జట్లలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చెరొకసారి ఈ ఘనతను అందుకున్నాయి. న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాతమ్, దక్షిణాఫ్రికా ఆటగాడు రికెల్టన్ ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో (ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో) టాప్ టెన్ లో కొనసాగుతున్నారు. ఇక అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో న్యూజిలాండ్ బౌలర్లు మాట్ హెన్రీ, విల్ ఓ రూర్కే, మైఖేల్ బ్రేస్ వెల్ టాప్ -10 లో కొనసాగుతున్నారు. ఇక టాప్ -10 ఎకనామీ రేట్లలో ముల్డర్, కేశవ్ మహారాజ్ ఉన్నారు. ఇందులో బ్రేస్ వెల్ కూడా ఉండడం విశేషం. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్ లాహర్ లోని గడాఫీ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ 23 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మైదానంలో ఈ టోర్నీలో ఇప్పటివరకు నాలుగుసార్లు 300+ స్కోర్లు నమోదయ్యాయి. ఇక న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా 2011, 2015 ప్రపంచ కప్ లో నాకౌట్ మ్యాచ్లలో తలపడ్డాయి. అప్పుడు న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. 2023 వన్డే వరల్డ్ కప్ లో మాత్రం న్యూజిలాండ్ ఓటమి పాలైంది.
జట్ల అంచనా ఎలా ఉందంటే
దక్షిణాఫ్రికా: రికెల్టన్, బవుమా(కెప్టెన్), వాన్ డెర్ డస్సెన్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సన్, జార్జ్ లిండే, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగి సో రబడ, ఎన్ గిడి.
న్యూజిలాండ్
యంగ్, కాన్వే, విలియంసన్, రచిన్ రవీంద్ర, లాతం, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, స్మిత్, విల్ ఓ రూర్కే.
Also Read : సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మధ్య రెండవ సెమీస్ మ్యాచ్ నేడు.. టీమిండియాతో ఫైనల్లో పోటీపడే జట్టు ఏదో?