Homeక్రీడలుక్రికెట్‌Mumbai Indians: ముంబైకి ఇంకా దారులు ముగిసిపోలేదు.. ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం ఉంది..

Mumbai Indians: ముంబైకి ఇంకా దారులు ముగిసిపోలేదు.. ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం ఉంది..

Mumbai Indians: వరుస ఓటములతో ఇప్పటికే కృంగిపోయింది ముంబై జట్టు. ఇకపై ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు లేవని.. ఇంటికి వెళ్లడమే మిగిలి ఉందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముంబై జట్టు ఈ స్థాయిలో ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. గొప్ప గొప్ప ప్లేయర్ లు ఉన్నప్పటికీ ఇలాంటి ఆట తీరు కొనసాగించడం నిజంగా ముంబై జట్టు అభిమానులకు ఇబ్బందికరంగా మారింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు మాదిరిగానే ముంబై ఐదుసార్లు విజేతగా నిలిచింది. గతం ఎంతో ఘనం.. నేడు మాత్రం అత్యంత దారుణం అన్నట్టుగా ముంబై జట్టు ఆటతీరు కొనసాగుతోంది.

ముంబై జట్టులో రోహిత్ శర్మ కీలక ఆటగాడిగా ఉన్నప్పటికీ.. గాయం వల్ల అతడు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇకపై అతడు జట్టులోకి వచ్చినప్పటికీ కూడా ఉపయోగం లేదు. రికెల్టన్, డికాక్, సూర్య కుమార్ యాదవ్, నమన్ దీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సూపర్ స్టార్లు ముంబై జట్టులో ఉన్నారు.. ఇంతమంది ప్లేయర్లు ఉన్నప్పటికీ ముంబై జట్టు గెలిచే అవకాశం లేకుండా పోతోంది. వరుసగా ఓటములు ఎదుర్కొని దాదాపు ప్లే ఆఫ్ ఆశలను మొత్తం సంక్లిష్టం చేసుకుంది.

ముంబై జట్టు ప్లే ఆఫ్ వెళ్ళాలంటే ఐపీఎల్లో అద్భుతాలు జరగాలి.. మిగతా ఐదు మ్యాచ్లలో ముంబై జట్టు అతి భారీ తేడాతో విజయం సాధించాలి. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను దాటేయాలి. అప్పుడే ముంబై జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ముంబై జట్టు కంటే మిగతా జట్లు అద్భుతంగా ఆడుతున్నాయి.. ఒకవేళ ముంబై జట్టు ఎదురుదాడికి దిగితే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ అత్యంత భారీ తేడాతో గెలిచే అవకాశం మాత్రం ఉండదు.. ఎందుకంటే ముంబై బౌలింగ్ లో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ కూడా అంత బలంగా లేదు. అలాంటప్పుడు ముంబై జట్టు మిగతా మ్యాచ్లు గెలిచి.. ప్లే ఆఫ్ వెళ్లాలంటే అంత సులభం కాదు. కాకపోతే ఐపీఎల్లో ఏదైనా జరుగుతుంది.. అలాంటప్పుడు ముంబై జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అంశాలను సులభంగా కొట్టి పారేయలేమని విశ్లేషకులు అంటున్నారు.

చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా నిర్వేదంగా మాట్లాడాడు. జట్టు ఓటములు బాధ కలిగిస్తున్నాయని చెప్పాడు. ఈ సందర్భంలో జట్టు గురించి ఏం మాట్లాడినా సరే.. ఇబ్బందిగానే ఉంటుందని.. హార్దిక్ పాండ్యా ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టులో అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. ఎక్కడ లోపం జరుగుతుందో అర్థం కావడం లేదని హార్దిక్ పాండ్యా అన్నాడు. వచ్చే మ్యాచ్లో ఇంకా అత్యుత్తమంగా ఆడేందుకు తాము ప్రయత్నిస్తామని హార్దిక్ పాండ్యా అన్నాడు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version