Team India : ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద ఇండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా చేసిన మొదటి తప్పు అదే…ఇక టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి వచ్చిన ఇండియన్ బ్యాట్స్ మెన్స్ లలో మొదట రుతురాజ్ గైక్వాడ్ తొందరగా అవుటైనప్పటికీ ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ శుభ్ మన్ గిల్ తో కలిసి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడారు.వీళ్లిద్దరూ కలిసి మూడో వికెట్ కి 200 పరుగుల పతనర్ షిప్ ను నెలకొల్పారు. దాంతో ఇండియా 399 పరుగులు చేయడంలో తన వంతు కృషిగా వాళ్ళిద్దరూ సెంచరీలు చేసి టీమిండియా స్కోర్ ని భారీ స్కోరు చేసే దిశగా పరుగులు పెట్టించారు.
ఇక వీళ్ళు ఔట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేసి వరుసగా రెండు మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. అలాగే చివర్లో సూర్య కుమార్ యాదవ్ కూడా తనదైన అగ్రెసివ్ ఇన్నింగ్స్ తో బ్యాటింగ్ చేశాడు కెమెరాన్ గ్రీన్ వేసిన ఒకే ఓవర్ లో వరుసగా నాలుగు సిక్స్ లు కొట్టి ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొడతాడేమో అన్నంత రేంజ్ లో విరుచుకుపడి ఆడాడు.ఇక వన్డే ల్లో వరుసుగా నాలుగు బంతులకి నాలుగు సిక్స్ లు కొట్టిన ప్లేయర్ గా సూర్య కుమార్ యాదవ్ ఇండియన్ ప్లేయర్ లలో రోహిత్ శర్మ తర్వాత సెకండ్ ప్లేస్ ని సొంతం చేసుకున్నాడు. ఇక దీంతో మన టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి ఐదు వికెట్లు కోల్పోయి 399 పరుగులు సాధించింది.
ఇక చివరికి సూర్య కుమార్ యాదవ్ 37 బంతుల్లో 72 పరుగులు చేసి ఆరు సిక్స్ లు, ఆర్ ఫోర్లు కొట్టి నాటౌట్ గా నిలిచాడు. దాంతో ఇండియా ఒక భారీ స్కోర్ అయితే చేయగలిగింది ఈ మ్యాచ్ తో మన ప్లేయర్లు అందరూ ఫామ్ లోకి వచ్చారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇదే రేంజ్ లో ఆడితే ఇండియా వరల్డ్ కప్ సాధించడం పెద్ద కష్టమైతే కాదు. ఎందుకంటే ఇంత బలమైన ఆస్ట్రేలియా టీం ని 2-0 తేడాతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే చిత్తుచిత్తుగా ఓడించి కప్ ని సొంతం చేసుకున్నారు.ఇక ఇండియన్ టీం కి మిగతా టీమ్ లను ఓడించడం పెద్ద కష్టమైతే కాదు దాంతో ఈసారి వరల్డ్ కప్ మనదే అనేది స్పష్టంగా తెలిసిపోతుంది…