
ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించిన ఇండియాను ఇండియాలోనే ముచ్చెమటలు పట్టిస్తోంది ఇంగ్లండ్ జట్టు. తాజాగా తొలిటెస్టులో ఆ జట్టు బ్యాట్స్ మెన్ అంతా రాణించారు. కెప్టెన్ రూట్ ఏకంగా 218 పరుగులతో డబుల్ సెంచరీ చేయడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది.అతడికి సిబ్లి 87, బెన్ స్టోక్స్ 82 పరుగులతో సహకరించారు.
అయితే ఆట ఆఖరి రోజు అంతిమంగా భారత బౌలర్లు రాణించడంతో ఇంగ్లండ్ జట్టు 555 పరుగులకు 8 వికెట్లతో నిలిచింది. తొలి రెండు రోజులు ఇంగ్లండ్ ఆటనే కొనసాగినట్టైంది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్, నదీమ్, ఇషాంత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయకపోవడంతో చివరి రోజు మరిన్ని పరుగులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
రెండో రోజు రూట్, స్టోక్స్ భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు. ఓపికగా ఆడుతూ సహనాన్ని పరీక్షించారు. స్టోక్స్ కాస్త వేగంగా ఆడి పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే రూట్ డబుల్ సెంచరీ సాధించాడు. గత మూడు టెస్టుల్లో వరుసగా ఇది రెండో డబుల్ సెంచరీని రూట్ చేశాడంటే అతడెంత ఫామ్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆఖరి సెషన్ లో భారత బౌలర్లు చెలరేగారు. అశిన్, నదీమ్, ఇషాంత్ సహా అందరూ తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను 8 వికెట్లు కోల్పోయేలా చేశారు. కానీ చివరి బౌలర్లు పట్టుదలగా ఉండడంతో ఇంగ్లండ్ ఆల్ ఔట్ కాలేదు. ఇక మూడోరోజు ఏం జరుగుతుందనేది చూడాలి.
భారత బ్యాట్స్ మెన్ మూడో రోజు నిలబడితేనే ఈ టెస్టు డ్రా అవుతుంది. అవుట్ అయితే ఓటమి ఖాయం. ఇంగ్లండ్ ను ఇండియా ఎలా కాచుకుంటుందనేది వేచిచూడాలి.