Site icon OkTelugu

Ravichandran Ashwin: హమ్మయ్యా… అశ్విన్ తిరిగి వచ్చాడు

Ravichandran Ashwin

Ravichandran Ashwin

Ravichandran Ashwin: రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో అర్ధాంతరంగా చెన్నై వెళ్లిపోయిన భారత జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తిరిగి జట్టులోకి వస్తాడని బీసీసీఐ ప్రకటించింది. ఆదివారం అతడు అందుబాటులో ఉంటాడని వివరించింది. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో రెండవ రోజు ఆట ముగిసిన అనంతరం అశ్విన్ అర్ధాంతరంగా చెన్నై వెళ్లిపోయాడు. ఆమె తల్లికి ఆరోగ్యం బాగో లేకపోవడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యపరంగా ఆమె పరిస్థితి బాగా లేకపోవడంతో పక్కనే ఉండాలని నిర్ణయించుకొని రవిచంద్రన్ చెన్నై వెళ్ళిపోయాడు.

“రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా చెన్నై వెళ్లిపోయాడు. అతడి మాతృమూర్తి అనారోగ్యంతో బాధపడుతోంది. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇలాంటప్పుడు కుటుంబానికి అశ్విన్ తోడ్పాటు ఎంతో అవసరం. అందుకే అతడు జట్టు నుంచి తాత్కాలికంగా వైదొలిగాడు. హస్తం అతడి మాతృమూర్తి ఆరోగ్యం మెరుగు అవుతున్న నేపథ్యంలో తిరిగి అతడు జట్టులోకి వస్తున్నాడు. నాలుగు రోజు ఆటలో భాగమవుతున్నాడు” అని బీసీసీఐ ప్రకటించింది. అయితే బీసీసీఐ ఈ ప్రకటన చేసే కంటే ముందే భారత స్పిన్నర్ కులదీప్ యాదవ్ స్పందించాడు. “రవిచంద్రన్ అశ్విన్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కచ్చితంగా సమాచారం లేదు. కానీ యాష్ భాయ్ తిరిగి వస్తాడని భావిస్తున్నాను” అని కులదీప్ చెప్పాడు. అశ్విన్ జట్టుకు దూరం కావడంతో.. ఆ ప్రభావం మిగతా వారిపై పడకూడదని టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత తెలివిగా బౌలింగ్ చేయించాడు. నలుగురు బౌలర్లతో మార్చి మార్చి బౌలింగ్ చేయించి ఇంగ్లాండ్ జట్టును కట్టడి చేయించాడు.

అశ్విన్ లేకపోయినప్పటికీ భారత బౌలర్లు ఇంగ్లాండ్ వణికించారు. అద్భుతమైన పోరాట పట్టిన చూపిస్తూ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టుకు 126 పరుగుల లీడ్ దక్కేలా చేశారు. సిరాజ్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. కులదీప్, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశాడు. బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అయితే శనివారం ఆటలో అశ్విని స్థానంలో దేవ్ దత్ పడకల్ సబ్ స్టి ట్యూట్ ఫీల్డర్ గా వచ్చాడు. క్రికెట్ నిబంధనల ప్రకారంబ్సబ్ స్టి ట్యూట్ బౌలింగ్ వేసే అవకాశం ఉండదు. బ్యాటింగ్ చేసే వెసులుబాటు కూడా ఉండదు.. కంకషన్ సబ్ స్టి ట్యూట్ ఆటగాడికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది.

Exit mobile version