MS Dhoni: వెళ్లేవాడి కంటే ఉండేవాడికే ఆత్రుత ఎక్కువ అంటారు.. అది మిగతా సందర్భాల్లో ఏమో గాని.. ఇప్పుడు ధోని విషయంలో మాత్రం నూటికి నూరు పాళ్లు కాదు, కోటిపాళ్ళు ఈ ఆతృత అధికంగా ఉంది.. కొంతమంది షుగర్ కోటేడ్ వ్యక్తులకు ధోని ఎప్పుడు టి20 లకు అదే ఐపీఎల్ కు గుడ్ బై చెప్తే బాగుంటుందనే ఆత్రుత కనిపిస్తోంది.. అసలు వాళ్లు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు.. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు.
ధోని వ్యక్తిగత ఆరోగ్యం బాగాలేదు. ఆ విషయం అతడు అనేక సందర్భాల్లో చెప్పాడు. చెన్నై జట్టులో తనకు ఎందుకు కొనసాగుతోంది.. చెన్నై జట్టుతో తనకున్న అనుబంధం ఏంటి అనే విషయాన్ని అతడు అనేక సందర్భాల్లో వెల్లడించాడు. కానీ కొంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది అర్థం కావడం లేదు.. పైగా ధోని విషయంలో ఏదో ఒక రూమర్ సర్కులేట్ చేస్తూనే ఉన్నారు. చివరికి ధోని స్వయంగా వచ్చి చెన్నై జట్టు ప్లేయర్లతో కలిసి ప్రాక్టీస్ చేసినా వారికి నమ్మకం కుదరడం లేదు.
ఇప్పుడు ఏకంగా ధోని పేరుతో ఒక ఇంస్టాగ్రామ్ మెసేజ్లు ఒకటి క్రియేట్ చేశారు. దానిని ధోని ఇంస్టాగ్రామ్ స్టోరీ గా పోస్ట్ చేశాడని సర్కులేట్ చేయడం మొదలుపెట్టారు. ధోని ఇకపై ఐపీఎల్ ఆడబోడని.. అతడి ఆరోగ్యం బాగోలేదని ప్రచారం చేయడం మొదలుపెట్టారు.. ఐపీఎల్ ఆడాలా? వద్దా? అనేది ధోని ఇష్టం. శరీరం సహకరిస్తే ఆడతాడు.. లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాడు. ధోని ఐపీఎల్ ఆడక పోవడం అనేది దేశ సమస్య కాదు కదా.. ధోనికి కోట్లకు కోట్లు డబ్బులు ఇచ్చిన చెన్నై మేనేజ్మెంట్ కూడా ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు మధ్యలో ఉన్న వాళ్లకు ఎందుకు ఇంత తంటా. వాళ్లేమీ డబ్బులు ఇవ్వడం లేదు కదా.. ధోని ఆడితే చూడండి. ఇష్టం లేకపోతే చూడడం మానేయండి. అలాకాకుండా ఈ నెగిటివ్ ప్రచారం దేనికి.. ఇదిగో ఇలానే కౌంటర్ ఇస్తున్నారు ధోని అభిమానులు.. ఇప్పటికైనా ఈ నెగిటివ్ ప్రచారం ఆగిపోతుందా.. ధోని విషయంలో ఈ వ్యతిరేక ప్రాపగాండా ముగిసిపోతుందా.. ఇలాంటివి ధోని ఎన్ని చూడలేదు.. ఎన్ని తట్టుకోలేదు.. ఇన్ని దాటుకుని వచ్చాడు కాబట్టే తలా అయ్యాడు.
BREAKING NEWS
END OF LEGENDARY ERA
MS Dhoni Latest Instagram post. pic.twitter.com/nz4tKm8ZEj
— Muffatball vikrant (@Vikrant_1589) May 2, 2026