Virat Kohli reacts to Bengaluru victory: ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు 2024 వరకు దరిద్రం వైఫై లాగా ఉండేది. అనేక పర్యాయాలు ఫైనల్ వెళ్లినప్పటికీ ట్రోఫీ ఆదుకోలేకపోయింది. ఇకపై ఎప్పటికీ ట్రోఫీ అందుకోలేదా.. బెంగళూరు జట్టుకు ఆ యోగం లేదా అని చాలామంది కామెంట్ చేసేవారు. ఇక అభిమానులైతే తీవ్రంగా కలత చెందేవారు. దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణ తర్వాత బెంగళూరు ఐపిఎల్ విజేతగా నిలిచింది.
గత ఏడాది బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టును ఓడించింది. తద్వారా తొలిసారి ఛాంపియన్గా అవతరించింది. ఈ ఏడాది కూడా బెంగళూరు అదరగొట్టింది. ప్రారంభం నుంచి విజేతగా నిలిచే వరకు సత్తా చూపించింది. ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ జట్టను వారి సొంత మైదానంలో ఓడించి సత్తా చూపించింది. తద్వారా వరుసగా రెండవసారి ట్రోఫీ అందుకొని సరికొత్త చరిత్రను లిఖించింది.
బెంగళూరు సాధించిన విజయం పట్ల ఆ జట్టు ఆటగాళ్లు రకరకాలుగా స్పందించారు. కోహ్లీ తీన్మార్ డాన్స్ వేసినప్పటికీ.. తన అసలైన ప్రతిస్పందన మాత్రం తెలియజేయలేదు. దీంతో అభిమానుల్లో ఏదో ఒక కలత ఉండేది. అనుమానం కూడా ఉండేది. అయితే వాటన్నింటిని విరాట్ కోహ్లీ పటా పంచలు చేశాడు. ఒక స్పెషల్ వీడియోతో అభిమానులను ఆకట్టుకున్నాడు..
“ఈ సీజన్ ను సానుకూల దృక్పథంతో ప్రారంభించాం.. చివరికి విజేతగా నిలిచి దానిని ముగించాం.. వరుసగా రెండుసార్లు ట్రోఫీలు గెలవడం చాలా గొప్ప విషయం. బెంగళూరు దీనిని సాధించింది.. విజయాలు సాధ్యమయ్యాయి. ఒత్తిడి కూడా ఇబ్బంది పెట్టింది. అడ్డంకులు కూడా అవరోధాలు కలిగించాయి. ఇవన్నీ కూడా ఫాన్స్ సపోర్ట్ వద్దు పారిపోయాయి. అని భావోద్వేగాలను జట్టుగా కలిసి అనుభవించాం. బెంగళూరు జట్టు నాకు ఇల్లు లాంటిది.. ఈ అభిమానాన్ని మర్చిపోలేనని.. ఈ ట్రోఫీ సాధించడానికి గొప్పగా భావిస్తున్నానని” విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.
విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఏకంగా 675 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ చివరి వరకు నిలబడి సొంత జట్టును గెలిపించి.. విజేతగా నిలబడేలా చేశాడు. గత సీజన్ ఫైనల్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. తనను రన్ మిషన్ అని ఎందుకంటారో.. చేజ్ మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు. కాగా విరాట్ కోహ్లీ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.
Started the season with belief. Ended with back to back titles.
This team lived every emotion together. The highs, the pressure, the hurdles, and the unwavering support. It feels extra special because… this place is HOME! ❤️ @RCBTweets pic.twitter.com/H02HdsHCX3— Virat Kohli (@imVkohli) June 9, 2026
