https://oktelugu.com/

IND VS BAN Test Match : బంగ్లా అభిమానిని చితక్కొట్టిన టీమిండియా ఫ్యాన్స్.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదిక గా భారత్ - బంగ్లా జట్లు రెండవ టెస్టులో తలపడుతున్నాయి. ఈ టెస్ట్ కు బంగ్లా సూపర్ ఫ్యాన్ టైగర్ రాబి హాజరయ్యాడు. ఈ వార్త మీడియాలో సంచలనం సృష్టించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 27, 2024 / 04:33 PM IST

    Bangladesh fan Tiger Robbie

    Follow us on

    IND VS BAN Test Match :  టైగర్ రాబి పై టీమిండియా కు చెందిన అభిమానులు దాడి చేశారని తెలుస్తోంది. అందువల్లే అతడు ఆసుపత్రి పాలయ్యాడని సమాచారం. టీమిండియా అభిమానులు కొట్టిన దెబ్బలకు అతడు అపస్మారస్థితికి చేరుకున్నాడని.. దీంతో అతడిని భద్రతా సిబ్బంది దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించాలని సమాచారం. జాతీయ మీడియాలో ప్రసరమవుతున్న వార్తల ప్రకారం కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. లంచ్ విరామం తర్వాత 100 పరుగులు చేసింది. కానీ మరో వికెట్ కూడా నష్టపోయింది. ఆకాష్ దీప్ రెండు, రవిచంద్రన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణకు అంతరాయం ఏర్పడింది.. ఈ మ్యాచ్ జరుగుతుండగానే రాబికి, టీమిండియా అభిమానులకు వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. రాబి సీ బ్లాక్ లో కూర్చుని మ్యాచ్ ఆస్వాదిస్తున్నాడు. అతడు బంగ్లా జాతీయ జెండా ఊపుతూ.. ఆ జట్టుకు మద్దతుగా నినాదాలు చేయడం మొదలుపెట్టాడు.. అయితే అతడు నిలబడి ఉండడంతో కూర్చున్న ప్రేక్షకులకు ఇబ్బంది కలిగింది. దీంతో వారు అతడిని కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. అతడు కూర్చోకపోవడంతో.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈలోపు లంచ్ బ్రేక్ రావడంతో అతనిపై భారత అభిమానులు దాడికి దిగారని తెలుస్తోంది.. దీంతో అతడు కింద పడిపోయాడు. అభిమానులు కొట్టిన దెబ్బలకు అపస్మారక స్థితికి చేరుకున్నాడని తెలుస్తోంది.

    ఆసుపత్రికి తీసుకెళ్తుండగా..

    రాబి ని బంగ్లాదేశ్ జట్టు సూపర్ ఫ్యాన్ అని పిలుస్తుంటారు. టీమిండియా అభిమానులు కొట్టిన తర్వాత అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మీడియాతో మాట్లాడాడు.. తనను పొత్తికడుపులో, వీపు భాగంలో బలంగా కొట్టారని రాబి పేర్కొన్నాడు. ఫలితంగా ఊపిరి తీసుకోవడం కష్టం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసు భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో తనకు ప్రాణాపాయం తప్పిందని.. ప్రస్తుతం తనను ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని రాబి వ్యాఖ్యానించాడు. అయితే దీనిపై కాన్పూర్ పోలీసులు స్పందించారు. అతనిపై దాడి జరిగిందనే విషయాన్ని నిర్ధారించలేమని పేర్కొన్నారు. డిహైడ్రేషన్ వల్ల రాబి ఇబ్బంది పడుతున్నాడని.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని వారి పేర్కొన్నారు.. మరోవైపు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో కాన్పూర్లో బంగ్లా – ఇండియా మధ్య జరిగే రెండవ టెస్ట్ ను అడ్డుకుంటామని హిందూ మహాసభ హెచ్చరించింది. దీంతో కాన్పూర్లో మైదానానికి పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భారత్ – బంగ్లా ఆటగాళ్లకు త్రీ టైర్ సెక్యూరిటీ కల్పించారు. మైదానంలో భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. అయితే ఇంత చేసినప్పటికీ బంగ్లాదేశ్ సూపర్ ఫ్యాన్ టైగర్ రాబి పై దాడి జరగడం విశేషం. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 35 ఓవర్ల పాటు ఆడింది. మూడు వికెట్లు నష్టపోయి 107 రన్స్ చేసింది. వర్షం కురవడంతో మ్యాచ్ ను ఎంపైర్లు నిలుపుదల చేశారు. అవుట్ ఫీల్డ్ పై కవర్లు తప్పారు. వెలుతురు లేకపోవడంతో ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం ముష్ఫీకర్ రహీమ్(6), మోమినుల్ హక్ (40) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. బంగ్లా కెప్టెన్ శాంటో 31 రన్స్ చేశాడు. జకీర్ హుస్సేన్ 0, షాద్మాన్ 24 పరుగులు చేశారు.