Axar Patel: సహజంగా ఐపీఎల్లో ఏ జట్టు కెప్టెన్ అయినా దూకుడుగానే ఉంటాడు. మొండిగా దూసుకు వెళ్దామని భావిస్తాడు. తన జట్టు ఆటగాళ్లకు కూడా అదే విధంగా హిత బోధ చేస్తుంటాడు. ఇందులో తప్పులేదు. తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఐపీఎల్ అనేది రిచ్ క్రికెట్ లీగ్ లాంటిది. ఇందులో వ్యూహాలకు.. ప్రతి వ్యూహాల కంటే దూకుడుకే ప్రథమ ప్రాధాన్యం లభిస్తుంది. ఎదురుదాడికే అగ్ర భాగం దక్కుతుంది. ఎంత వేగంతో ఆడాం.. ఎంత దూకుడుతో ఆడాం.. అనేవే ముఖ్యంగా ఉంటాయి. అంతేతప్ప బ్రెయిన్ గేమ్ అనేదానికి ఇక్కడ అవకాశం ఉండదు. అందువల్లే ఐపిఎల్ లో వికెట్ల కంటే పరుగులే ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని రవిచంద్రన్ అశ్విన్ లాంటి మేటి ఆటగాడు సైతం దేవుడా మా బౌలర్లను కాపాడు అని సోషల్ మీడియాలో వేడుకున్నాడు.. కానీ అప్పుడప్పుడు బుర్రకు పని చెప్పే కెప్టెన్లు కూడా ఉంటారు. క్రికెట్ గేమ్ ను మైండ్ గేమ్ గా మార్చి గెలుస్తుంటారు. అలాంటిదే శనివారం చోటుచేసుకుంది. మామూలుగా అయితే ప్రత్యర్థి జట్టుపై మహేంద్ర సింగ్ ధోని ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటాడు. అయితే అతడి ఇప్పుడు కెప్టెన్ కాదు కాబట్టి.. అతడి స్థానాన్ని అక్షఆర్ పటేల్ ఆక్రమించినట్లు తెలుస్తోంది.
Also Read:సంజీవ్ గొయెంకా సార్.. మీరు మిస్సైంది ఆణిముత్యాన్ని!
అత్యంత తెలివిగా
అక్షర్ పటేల్ ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. మెరిట్ ఉన్న ఆటగాడు. బ్యాటింగ్ బాగా చేస్తాడు. బౌలింగ్ అద్భుతంగా వేస్తాడు. ఫీల్డింగ్ కూడా మెరుపు వేగంతో చేస్తాడు. అందువల్లే సమకాలీన క్రికెట్లో టీమిండియా తరఫున అతడు అద్భుతమైన ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. టి20 వరల్డ్ కప్ ద్వారా అతడి ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఇక అప్పటినుంచి అతడు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక తాజాగా శనివారం చెన్నై వేదికగా చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ తన మైండ్ గేమ్ ను చెన్నై ఆటగాళ్లకు రుచి చూపించాడు. అతడు కొట్టిన దెబ్బ ఎలాంటిది అంటే.. సొంత వేదికలో చెన్నై జట్టు.. వేలాదిమంది సొంత అభిమానుల మధ్య 25 పరుగులతో ఓడిపోయేంత… ఈ మైదానంపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అక్షర్ పటేల్.. అప్పటికే సగం మ్యాచ్లో విజయం సాధించాడు. ఆ తర్వాత మిగతా ప్రణాళికలను వేగంగా అమల్లో పెట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఒక రకంగా ఈ మైదానంపై అది పెద్ద టార్గెట్. చెన్నై జట్టు సొంత వేదిక మీద ఆడుతోంది కాబట్టి..ఆ టార్గెట్ చేజ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అక్షర్ పటేల్ తెలివిగా బౌలర్లను ప్రయోగించడంతో చెన్నై జట్టుకు ఇబ్బందులు తప్పలేదు. ఇక విజయ్ శంకర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడు ఎల్బిడబ్ల్యు గా అవుట్ అయినప్పటికీ ఢిల్లీ జట్టు రివ్యూ తీసుకోలేదు. విజయ్ శంకర్ రెండు క్యాచ్ లను కూడా ఢిల్లీ ఆటగాళ్లు వదిలేసారు. ఇక్కడ 47 బంతుల్లో విజయ్ శంకర్ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్లో సులభంగా గెలిచింది. టి20 లలో 47 బంతులు ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేయడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే వేగానికి అసలు సిసలైన కొలమానంగా ఉండే టీ20లలో ఎంత తక్కువ బంతుల్లో అన్ని ఎక్కువ పరుగులు చేయాలి. అప్పుడే జట్టుకు లాభం కలుగుతుంది. లేకుంటే ఇగో చెన్నై లాగా ఓటమిపాలవుతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో పట్టుకోవడం కంటే వదిలేయాలి. గెలవడానికి ఓడిపోవాలి. అప్పుడే క్రికెట్ మజా లభిస్తుంది. అది చూసే అభిమానులకు.. మైదానంలో ఆడే ఆటగాళ్లకు..